Gang Rapes Hyd : ఐటీ హబ్ మాటేమిటో కానీ హైదరాబాద్ ఇప్పుడు జాతీయ స్థాయిలో టాప్ లో నిలిచింది గ్యాంగ్ రేప్(Gang Rapes Hyd) ల విషయంలో. ఇప్పటికే అమ్నీషియా పబ్ కేసు నానా రభస సృష్టిస్తే మరికొన్ని కేసులు వెలుగు చూడడం కలకలం రేపింది.
నగరంలో ఇప్పటి వరకు నలుగురి మైనర్లపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు వెలుగు చూశాయి. అమ్మమ్మ ఇంటికి వెళుతున్న 12 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మే 31న జరిగింది.
ఆ రోజు నుంచే బాలిక కనిపించకుండా పోయింది. జూన్ 1న సుల్తాన్ సాహి ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ లో బాలికను కనుగొన్నారు. క్యాబ్ డ్రైవర్ ఆమెను కొందుర్గు లోని స్నేహితుడి ఇంటికి తీసుకు వెళ్లాడు.
అక్కడ వారిద్దరూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం వారు ఆ బాలికను దింపారు. ఆ ఇద్దరిని పోలసులు గుర్తించారు. వారిని 36 ఏళ్ల షేక్ కలీమ్ అలీ, మహ్మద్ లుక్మాన్ అహ్మద్ యజ్ఞానీగా గుర్తించారు.
వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇక రెండో కేసు రిటైల్ దుకాణంలో పని చేస్తున్న ఒక అమ్మాయి రేప్ కు గురైంది. 21 ఏళ్ల మహ్మద్ సుఫ్యాన్ ఆమెను 31న
ఆమెను ఇంటికి తీసుకు వెళ్లి లైంగికంగా వేధించారు.
బాలిక కడుపు నొప్పితో ఫిర్యాదు చేయడంతో నిందితుడిని కాలా పత్తర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో కేసు అనాథ ఆశ్రమానికి చెందిన మరో మైనర్ బాలికపై ఏప్రిల్ 22న కారులో అత్యాచారం జరిగింది.
ఈ ఘటన ఇప్పుడే వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలిక బర్త్ డే వేడుకలు జరుపుకునేందుకు కేక్ కొనేందుకు వెళ్లింది. అక్కడ నిందితుడు మాయ
మాటలు చెప్పి కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలికను విచారించగా నిందితుడు తనకు మొబైల్ ఇచ్చాడని తెలిపింది. ఫోటో కాపీ షాపులో పని చేస్తున్న 23 ఏళ్ల నిందితుడు సురేష్ ను అరెస్ట్
చేశారు. థియేటర్ లో తనపై రేప్ జరిగిందంటూ బాలిక చెప్పడంతో నాలుగో కేసు నమోదైంది.
నిందితుడు మైనర్. కొన్ని నెలలుగా బాలికతో టచ్ లో ఉన్నాడు. సినిమా చూద్దామని రప్పించాడు. రేప్ చేశాడు. ఈ ఘటన నెల రోజుల కిందట
జరిగినట్లు సమాచారం. రాజేంద్ర నగర్ పోలీస్ కేసు నమోదు చేసింది.
గత నెల 28న అమ్నీషియా పబ్ కేసు వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. మొత్తంగా హైదరాబాద్ ఇప్పుడు గ్యాంగ్ రేప్(Gang Rapes Hyd)
లకు అడ్డాగా మారిందని ఆరోపణలు ఉన్నాయి.
Also Read : బీజేపీ ఎమ్మెల్యేకు షాక్ కేసు నమోదు