Ganta Srinivasarao: చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్న సీనియర్ నేతలు !

చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్న సీనియర్ నేతలు !

Ganta Srinivasarao: టీడీపీ, జనసేన కూటమి మొదటి జాబితా విడుదల కావడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. మొదటి జాబితాలో చోటు దొరకని వారు… తరువాత జాబితాలో తమ స్థానంపై అనుమానాలు ఉన్నవారు… టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆలపాటి రాజా, బొడ్డు వెంకటరమణ, పిల్లా గోవింద్, దేవినేని ఉమా, గంటా శ్రీనివాస్ లు చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా సీనియర్లకు టికెట్‌ ను ఎందుకు ఇవ్వలేకపోతున్నామన్న విషయాన్ని ఆయా నేతలకు చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా కొన్నిచోట్ల సీనియర్లు త్యాగాలు చేయక తప్పదని చంద్రబాబు నేతలకు సూచించినట్లు సమాచారం. చంద్రబాబుతో భేటీ అనంతరం కొంతమంది నేతలకు తమ సీట్లపై లేదా తదుపరి రాజకీయ భవిష్యత్ పై భరోసా వచ్చినట్లు తెలుస్తోంది.

Ganta Srinivasarao – గంటా శ్రీనివాస్ సీటుపై కొనసాగుతున్న ఉత్కంఠ !

సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాస్‌(Ganta Srinivasarao) లతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల్లో కొన్ని కీలక అంశాలను నేతల దృష్టికి చంద్రబాబు తీసుకు వచ్చారు. గంటాను… వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్న చీపురుపల్లి అసెంబ్లీ నుండి పోటీ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే గంటా మాత్రం భీమిలి టికెట్‌ ను గంటా కోరినట్లు సమాచారం. లేదా చోడవరం నుండి అయినా అవకాశం కల్పించాలని అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడి నుండి పోటీ చేసినా గెలిచే సత్తా ఉన్న గంటాను… ఎక్కడి నుండి పోటీ చేయించాలి అనే విషయాన్ని తనకు వదిలిపెట్టమని చంద్రబాబు చెప్పిన్నట్లు తెలుస్తోంది.

Also Read : Velagapudi Ramakrishna Babu: టీడీపీ ఎమ్మెల్యేకి బెదిరింపు కాల్స్‌ ! పోలీసులకు ఫిర్యాదు !

Leave A Reply

Your Email Id will not be published!