George Fernandes : జార్జి ఫెర్నాండెజ్ సోష‌లిస్ట్ లెజెండ్

జ‌న‌వ‌రి 29న కేంద్ర మాజీ మంత్రి వ‌ర్దంతి

George Fernandes : భార‌త దేశ రాజ‌కీయాల‌లో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన అరుదైన రాజ‌కీయ నాయ‌కుడు జార్జ్ ఫెర్నాండెజ్. సోష‌లిస్ట్ దిగ్గ‌జంగా పేరొందారు. కీల‌క‌మైన సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. త‌ప్పులు చేసినా ఒప్పుకునే ధైర్యం ఆయ‌న‌కు ఉంది. దానిని స్వీక‌రించాడు కూడా. భిన్న‌మైన ఆలోచ‌నా ధోర‌ణితో త‌న‌ను తాను ప్ర‌త్యేక‌మైన నాయ‌కుడిగా ఎదిగాడు.

1980లలో సిక్కుల కోసం , 1990ల‌లో కాశ్మీరీల కోసం త‌న స్వ‌రాన్ని వినిపించాడు జార్జ్ ఫెర్నాండెజ్(George Fernandes). వ‌ల‌స కార్మికుల సంక్షేమం కోసం అహ‌ర‌హం శ్ర‌మించాడు. 1960 నుంచి 1970 దాకా తిరుగుబాటుదారుడిగా ఉన్నాడు. కృష్ణ మీన‌న్ మార్గ్ లో ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ కు ఎలాంటి భ‌ద్ర‌త లేకుండా ఉన్నాడు.

2002లో పాకిస్తాన్ హై క‌మీష‌న‌ర్ అయిన అష్ర‌ఫ్ ఖాజీని వ్య‌క్తిత్వం లేని వ్య‌క్తిగా ప్ర‌క‌టించిన‌ప్పుడు జార్జ్ ఫెర్నాండెజ్ అత‌డిని భోజ‌నానికి ఆహ్వానించాడు. దేశ చ‌రిత్ర‌లో చెర‌ప‌లేని అధ్యాయం ఆయ‌న‌. ఈ లోకాన్ని వీడి స‌రిగ్గా జ‌న‌వ‌రి 29తో నాలుగు సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. జీవిత‌మంతా పోరాటం చేశాడు.

దేశానికి స్వేచ్ఛ ల‌భించిన త‌ర్వాత మ‌చ్చ లేని నాయ‌కుడిగా, హ‌క్కుల కోసం నినదించిన యోధుడిగా గుర్తింపు పొందారు జార్జ్ ఫెర్నాండెజ్. ఎన్నో ప‌ద‌వులు చేప‌ట్టినా చివ‌రి దాకా అత్యంత సాధార‌ణ‌మైన జీవితం గ‌డిపిన నాయ‌కుడు. దేశంలో కీల‌క‌మైన ర‌క్ష‌ణ శాఖ‌ను చేప‌ట్టాడు.

జార్జ్ ఫెర్నాండెజ్ రాజ‌కీయ ప్ర‌స్థానంలో కీల‌క‌మైన మ‌లుపులు ఉన్నాయి. 1974లో రైల్వే స‌మ్మెతో ఒక్క‌సారిగా దేశం విస్తు పోయేలా చేశాడు. 1977లో కోకో కోలా కంపెనీని దేశం వ‌దిలి వెళ్లేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు ఫెర్నాండెజ్(George Fernandes). 1999లో కార్గిల్ యుద్దాన్ని, అణ్వ‌స్త్ర ప‌రీక్ష‌ల‌ను ప‌ర్య‌వేక్షించిన రక్ష‌ణ శాఖ మంత్రి గా చ‌రిత్ర పుట్లో నిలిచి పోయారు.

ఫెర్నాండెజ్ స్వ‌స్థ‌లం క‌ర్ణాట‌క‌. 19 ఏళ్ల వ‌య‌స్సులో ఉపాధి కోసం ముంబైకి చేరాడు. ఓ పేప‌ర్ లో ప్రూఫ్ రీడ‌ర్ గా ప‌ని చేసి.. రామ్ మ‌నోహ‌ర్ లోహియా వంటి నేత‌ల ప్ర‌భావంతో కార్మిక స‌మ‌స్య‌ల‌పై యుద్దం చేశాడు ఫెర్నాండెజ్. బంద్ లు, ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, ప్ర‌జా పోరాటాల‌కు నాయ‌క‌త్వం వ‌హించాడు.

ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆనాటి ఇందిరా గాంధీ సైతం ఫెర్నాండెజ్ ను చూసి వ‌ణికి పోయార‌న్న ప్ర‌చారం ఉంది. బీహార్ లోని ముజ‌ఫ‌ర్ పూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మొరార్జీ దేశాయ్ కేబినెట్ లో మంత్రిగా కొలువు తీరారు. వీపీ సింగ్ కాలంలో రైల్వే మంత్రిగా ఉన్నారు.

వాజ్ పేయి హ‌యాంలో ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించారు ఫెర్నాండెజ్. చివ‌రి కాలంలో క్షిప‌ణుల స్కాం, తెహ‌ల్కా స్టింగ్ ఆప‌రేష‌న్ లాంటి వివాదాలు చుట్టు ముట్టాయి.

Also Read : మొఘ‌ల్ గార్డెన్స్ ఇక అమృత్ ఉద్యాన్

Leave A Reply

Your Email Id will not be published!