GG vs RCB WPL 2023 : వరుస ఓటములతో ఆర్సీబీ పరేషాన్
గుజరాత్ జెయింట్స్ తొలి విజయం
GG vs RCB WPL 2023 : ముంబై వేదికగా జరుగుతున్న మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) లో స్మృతీ మంధానకు అచ్చి రావడం లేదు. ఆమె సారథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఓటమి పాలవుతోంది.
ప్రీమియర్ లీగ్ వేలం పాటలో అత్యధిక ధరకు అమ్ముడు పోయింది మంధాన. ఏకంగా ఆర్సీబీ రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ దుమ్ము రేపుతోంది. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది.
తాజాగా లీగ్ మ్యాచ్ లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో మరోసారి బెంగళూరు ఓటమి పాలైంది. గుజరాత్ జెయింట్స్ చేతిలో 11 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.
డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది గుజరాత్ జెయింట్స్(GG vs RCB WPL 2023) . ఇక రిచ్ లీగ్ లో ఆర్సీబీకి వరుసగా ఇది మూడోసారి ఓటమి. ఇక గుజరాత్ జెయింట్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది.
సోఫియా డంక్లీ 65 రన్స్ తో రెచ్చి పోతే హర్లీన్ డియోల్ 67 రన్స్ తో దుమ్ము రేపింది. దీంతో గుజరాత్ జెయింట్స్ 7 వికెట్లు కోల్పోయి 201 భారీ స్కోర్ సాధించింది. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 190 రన్స్ మాత్రమే చేసింది.
ఆర్సీబీ ఓపెనర్ , న్యూజిలాండ్ బ్యాటర్ సోఫీ డివైన్ 45 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్సర్లతో 66 రన్స్ చేసింది. చివర్లో హీథర్ నైట్ 11 బంతులు ఆడి 30 రన్స్ చేసింది.
ఆఖరి ఓవర్ లో 24 రన్స్ కావాల్సి వచ్చింది. ఇక స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన మరోసారి విఫలమైంది. 18 రన్స్ చేసి నిరాశ పర్చగా ఎల్లీస్ పెర్రీ 32 రన్స్ తో రాణఙంచింది.
Also Read : పీఎం మోదీకి జే షా జ్ఞాపిక