Glenn Maxwell : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ సోషల్ మీడియా వేదికగా సెన్సేషన్ గా మారారు. బీసీసీఐ ఆధ్వర్యంలో ఇండియాలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే వరల్డ్ కప్ 2023 కొనసాగుతోంది.
Glenn Maxwell Trend
ఇందులో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆఫ్గనిస్తాన్ గెలుస్తుందని అనుకున్న తరుణంలో ఒంటరి పోరాటం చేశాడు గ్లెన్ మ్యాక్స్ వెల్(Glenn Maxwell). తను ఒక్కడే ఆసిస్ జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు .
ఓ వైపు గాయం తనను వెంటాడుతున్నా లెక్క చేయలేదు. నొప్పి తీవ్రమైనా సరే మైదానాన్ని వీడలేదు. మ్యాచ్ పరంగా తొలుత బ్యాటింగ్ కు దిగింది ఆఫ్గనిస్తాన్ జట్టు. నిర్ణీత 50 ఓవర్లలో 292 రన్స్ చేసింది. ఆసిస్ ముందు 293 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
అనంతరం మైదానంలోకి వచ్చిన ఆసిస్ కు ఊహించని షాక్ తగిలింది. వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్న తన జట్టును ముందుండి నడిపించాడు. ఒక్కడు ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా కేవలం 128 బంతులు ఎదుర్కొని 201 రన్స్ చేసి అజేయుడిగా నిలిచాడు. ఇందులో 14 ఫోర్లు 10 సిక్సర్లు ఉన్నాయి.
Also Read : Pawan Kalyan Go Back : పవన్ కళ్యాణ్ గో బ్యాక్