Glenn Phillips : గ్లెన్ ఫిలిప్స్ రియ‌ల్ టార్చ్ బేర‌ర్

మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చేశారు

Glenn Phillips : ఐపీఎల్ లో ఊహించ‌ని రీతిలో బిగ్ షాక్ ఇచ్చింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన లీగ్ మ్యాచ్ ల‌లో మోస్ట్ థ్రిల్లింగ్ విక్ట‌రీ మ్యాచ్ గా నిలిచి పోయింది రాజ‌స్థాన్ లోని జైపూర్ వేదికగా జ‌రిగిన లీగ్ మ్యాచ్.

మొద‌ట రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి 214 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఇప్ప‌టికే ప‌రాజ‌యాల బాట ప‌ట్టిన హైద‌రాబాద్ ఉన్న‌ట్టుండి జూలు విదిల్చింది. చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ కొన‌సాగింది. 215 ర‌న్స్ భారీ టార్గెట్ ను ప‌క‌డ్బందీగా ఛేదించింది. సంజూ శాంస‌న్ సేన‌కు చుక్క‌లు చూపించింది.

క్రీజులోకి వ‌చ్చిన అభిషేక్ శ‌ర్మ 55 ర‌న్స్ చేస్తే త్రిపాఠి 47 ప‌రుగుల‌తో రాణించారు. స్కోర్ బోర్డును ప‌రుగెత్తించారు. కేవ‌లం 7 బంతుల్లో మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చేశాడు గ్లెన్ ఫిలిప్స్(Glenn Phillips). కేవలం 12 నిమిషాల‌లో సీన్ మారి పోయింది. అలా మార్చేలా కీల‌కంగా మారాడు. ఐపీఎల్ లో రాజ‌స్థాన్ కు కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టాడు. 1 ఫోర్ 3 సిక్స‌ర్ల‌తో 25 ర‌న్స్ చేశాడు. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్ లో వ‌రుస‌గా 3 సిక్స‌ర్లు కొట్టాడు. చివ‌ర‌గా ప‌ని పూర్తి కానిచ్చేశాడు అబ్దుల్ స‌మ‌ద్.

అంత‌కు ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ లో జైశ్వాల్ 35 ర‌న్స్ చేస్తే జోస్ బ‌ట్ల‌ర్ 95 ర‌న్స్ చేశాడు. 5 ర‌న్స్ తేడాతో సెంచ‌రీ మిస్ అయ్యాడు. కెప్టెన్ సంజూ శాంస‌న్ 66 ప‌రుగుల‌తో రెచ్చి పోయాడు.

Also Read : ఆట‌లో భావోద్వేగాలు స‌హ‌జం – శాంస‌న్

Leave A Reply

Your Email Id will not be published!