Gold Prices Hike : భగ్గుమంటున్న బంగారం
పసిడి ధరలు పైపైకి
Gold Prices Hike : రోజు రోజుకు పసిడి అంటేనే భయపడే రోజులు రానున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. ఓ వైపు ఆయిల్, గ్యాస్ ధరలు కొండెక్కితే ఇంకో వైపు బంగారం ధరలు(Gold Prices Hike) అందనంత దూరంలో దూసుకు వెళుతున్నాయి. నిన్నటి దాకా రూ. 58 వేల లోపు ఉన్న పసిడి ధరలు అమాంతం రూ. 61,970కి దగ్గరలో చేరుకున్నాయి. దీంతో కొనుగోలుదారులు, బంగారం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది.
కేవలం ఉన్నత వర్గాలు, డబ్బున్న వాళ్లే పసిడి కొనే స్థాయికి చేరుకున్నాయి ధరలు. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. గత 24 గంటల్లో బంగారం పైపైకి చేరుకుంది. రూ.560కి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల పసిడి ధర అంటే 10 గ్రాములకు గాను ధర రూ. 61,320 కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,210గా ఉంది.
ఇక దేశంలోని ప్రధాన నగరాలలో కొంత మేర ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970కి చేరుకోగా 22 క్యారెట్ల ధర రూ. 56,810గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,470గా ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,360గా ఉంది. కోల్ కతా లో స్టాండర్డ్ బంగారం ధర రూ. 61,470గా ఉండగా 22 క్యారెట్ల పసిడి ధర 56,210గా ఉంది. బెంగళూరులో స్వచ్ఛమైన పసిడి ధర రూ. 61,270గా ఉండగా , 22 క్యారెట్ల ధర రూ. 56,250గా ఉంది.
Also Read : గూగుల్ లో మరికొందరికి ఉద్వాసన – సిఇఓ