Emiliano Martinez : ఎమిలియానో మార్టినెజ్ బెస్ట్ గోల్ కీపర్
ఫ్రాన్స్ ను అడ్డుకున్న అర్జెంటీనా గోల్ కీపర్
Emiliano Martinez : ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ ముగిసింది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది. ఇక టోర్నీలో భాగంగా ఫ్రాన్స్ ను మట్టి కరిపించిన మెస్సీ టీంలో అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు ఎమిలియానో మార్టినెజ్. ఫ్రాన్స్ దాడిని గోల్ కీపర్ గా అడ్డుకున్నాడు.
ఒక రకంగా అర్జెంటీనా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే టోర్నీలో భాగంగా ఇచ్చే అత్యుత్తమమైన గోల్డెన్ గోవ్ అవార్డును స్వంతం చేసుకున్నాడు ఎమిలియానో మార్టినెజ్(Emiliano Martinez). ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఫస్ట్ హాఫ్ లో అర్జెంటీనా ఆధిపత్యం కొనసాగిస్తే సెకండాఫ్ లో ఫ్రాన్స్ దూకుడు పెంచింది.
ఇరు జట్లు 2-2 గోల్స్ తో సమానంగా నిలిచాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ ఆట సమయాన్ని పెంచారు. ఈ సమయంలో ఇరు జట్లు 3-3తో ముగించాయి. అనంతరం అంపైర్లు పెనాల్టీ షూటౌట్ నిర్ణయించారు. ఇక ఇరు జట్లు తమ వంతు ప్రయత్నం చేశాయి. ఫైనల్ మ్యాచ్ లో రెండు గోల్స్ తో సత్తా చాటాడు కెప్టెన్ మెస్సీ. ఇక అర్జెంటీనా 4 గోల్స్ చేస్తే ఫ్రాన్స్ కేవలం 2 గోల్స్ తో మాత్రమే సరి పెట్టుకుంది.
పెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ ఆటగాళ్ల ప్రయత్నాలను ఒకే ఒక్కడు అడ్డుకున్నాడు ఎమిలియానో మార్టినెజ్. అతడే ఆ జట్టుకు గోల్ కీపర్. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కొంప మునిగేది. సో..విశ్వ విజేతగా నిలవడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను ఉత్తమ గోల్ కీపర్ గా పురస్కారాన్ని అందుకున్నాడు. విజయం అనంతరం మెస్సీని హత్తుకుని కంటతడి పెట్టాడు.
Also Read : ఇది అర్జెంటీనా ప్రజల విజయం – మెస్సీ