Golkonda Bonalu: గోల్కొండ బోనాలకు డేట్ ఫిక్స్ ! ఎప్పటి నుండి అంటే ?

గోల్కొండ బోనాలకు డేట్ ఫిక్స్ ! ఎప్పటి నుండి అంటే ?

Golkonda Bonalu : తెలంగాణా ప్రజలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పండుగల్లో ఒకటైన గోల్కొండ బోనాలకు డేట్ ఫిక్స్ అయింది. చారిత్రక గోల్కొండ బోనాలతోపాటు పాతబస్తీ లాల్‌దర్వాజా బోనాలు, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల షెడ్యూల్ కూడా దేవాదాయ శాఖ అధికారులు విడుదల చేసారు. జూన్‌ 26వ తేదీన గోల్కొండ బోనాలు(Golkonda Bonalu) ప్రారంభమవుతాయి. అలాగే.. జూలై 24వ తేదీతో అన్ని అమ్మవారి దేవాలయాల్లో బోనాలు ముగుస్తాయని దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు.

తెలంగాణా రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగ తేదీలను పరిశీలిస్తే… చారిత్రక గోల్కొండ కోట శ్రీజగదాంబిక అమ్మవారి బోనాలు జూన్‌ 26వ తేదీన ప్రారంభమై జూలై 24వ తేదీతో ముగుస్తాయి. ఇక సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జూలై 13న, లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జూలై 20న జరగనున్నాయి. గతేడాది గోల్కొండ బోనాలలో 25 లక్షల మంది భక్తులు పాల్గొనగా, ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Golkonda Bonalu – బోనాల షెడ్యూల్‌ ఇదే

జూన్‌ 26వ తేదీ గురువారం మొదటి బోనం,
29వ తేదీ ఆదివారం రెండవ బోనం,
జూలై 3వ తేదీ గురువారం మూడవ బోనం,
6వ తేదీ ఆదివారం నాల్గవ బోనం,
10వ తేదీ గురువారం ఐదవ బోనం,
13వ తేదీ ఆదివారం ఆరవ బోనం,
17వ తేదీ గురువారం ఏడవ బోనం,
20వ తేదీ ఆదివారం 8వ బోనం,
24వ తేదీ గురువారం 9వ బోనం నిర్వహించనున్నారు.

 

Also Read : CM Revanth Reddy: కులగణనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ – సీఎం రేవంత్‌

Leave A Reply

Your Email Id will not be published!