India Ki Udaan : గూగుల్ తో సాంస్కృతిక శాఖ ఒప్పందం

హెరిటేజ్ సైట్ ల మ్యాప్ కోసం ప్ర‌య‌త్నం

India Ki Udaan : కేంద్ర సాంస్కృతిక శాఖా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ తో భాగ‌స్వామ్యం చేసుకునే పనిలో ప‌డ్డది.

ఇందు కోసం హెరిటేజ్ (వార‌సత్వ చారిత్ర‌క సంప‌ద‌) సైట్ ల‌ను మ్యాప్ చేసేందుకు గూగుల్ తో ఒప్పందం కుదుర్చు కోవాల‌ని చూస్తోంది.

సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో దేశంలో 3,693 వార‌స‌త్వ ప్ర‌దేశాలు ఆర్కియాలజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా కింద ర‌క్షించ బ‌డుతున్నాయి.

అత్యాధునిక సాంకేతిక‌త‌పై బ్యాంకింగ్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ సైట్ ల‌ను మెరుగైన ప‌ర్య‌వేక్ష‌ణ ద్వారా మ‌రింత భ‌ద్ర‌త‌, ఆక్ర‌మ‌ణ‌ల‌ను త‌నిఖీ చేయ‌డం కోసం 3,600కు పైగా కేంద్ర ర‌క్షిత స్మార‌క చిహ్నాల స‌రిహ‌ద్దుల‌ను డిజిట‌ల్ మ్యాప్ చేసేందుకు ప్లాన్ రూపొందించింది.

టెక్నాల‌జీ దిగ్గ‌జం గూగుల్ ఈ ప‌నిని చేయ‌డంలో ప్ర‌భుత్వానికి సాయం చేయ‌గ‌ల‌ద‌ని , మంత్రిత్వ శాఖ , సెర్చ్ ఇంజ‌న్ దిగ్గ‌జం మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు సంబంధిత శాఖ మంత్రి.

సాంస్కృతిక శాఖ , గూగుల్ మ‌ధ్య ద‌శాబ్ధాల భాగ‌స్వామ్యానికి కొన‌సాగింపుగా ఇండియాకి ఉడాన్(India Ki Udaan) అనే ప్రాజెక్టును ఆవిష్క‌రించారు. 75 ఏళ్ల ప్ర‌యాణంలో భార‌త దేశం అనేక మైలు రాళ్ల‌ను సాధించింది.

దిగ్గ‌జ వ్య‌క్తుల వార‌స‌త్వాన్ని క‌లిగి ఉన్న‌ది. ఆర్కైవ‌ల్ మెటీరియ‌ల్ ను డిజిట‌లైజేష‌న్ చేయ‌డంలో గూగుల్ స‌హాయ ప‌డుతోంది. అంతే కాకుండా భార‌త దేశ ప‌ర్యాట‌క గ‌మ్య‌స్థానాల‌ను కూడా ప్రోత్సహించాల్సిన అవ‌స‌రం కూడా ఉంది.

గూగుల్ ఇప్ప‌టికే ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ పేరుతో విడుద‌ల చేసిన వీడియోకు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

Also Read : దేశ నిర్మాణం కోసం దేశ‌భ‌క్తి అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!