Google Employees Startup : గూగుల్ వేటు కొత్త కంపెనీ స్టార్ట్
ఐటీ దిగ్గజ కంపెనీకి బిగ్ షాక్
Google Employees Startup : గూగుల్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఏఐ చాట్ జిపిటి దెబ్బకు విల విల లాడుతోంది. ఈ తరుణంలో తమ సంస్థలో పని చేస్తున్న కీలకమైన ఏడుగురు వ్యక్తులను కాస్ట్ కట్టింగ్ లో భాగంగా తొలగించింది. దీంతో వేటుకు గురైన వారంతా ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు. ఆపై కొత్త కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. మరో వైపు చాట్ జిపిటి తో అనుసంధానమైన మైక్రో సాఫ్ట్ తన సెర్చింగ్ ఇంజిన్ బింగ్ కు జత చేర్చింది. ఈ సందర్బంగా సిఇఓ సత్య నాదెళ్ల సవాల్ విసిరారు.
తొలగించబడిన 7 మంది వ్యక్తులు కొత్త కంపెనీని(Google Employees Startup) ఏర్పాటు చేసేందుకు కలిసి రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కిర్క్ న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో డిజైన్ , డెవలప్ మెంట్ స్టూడియోను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. తనకు , తన టీంకు ఆరు వారాల సమయం ఇచ్చినట్లు పేర్కొన్నాడు.
గూగుల్ లో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్న ఒకరిని కంపెనీ ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా తొలగించారు. కానీ వదులు కోవడానికి బదులుగా తన సొంత కంపెనీని స్థాపించేందుకు ఎంచుకున్నాడు. హెన్రీ కిర్క్ కు అనేక మంది వేటుకు గురైన జాబర్స్ కూడా మద్దతు ఇచ్చారు. గూగుల్ సాగనంపిన 12,000 మంది ఉద్యోగులో ఒకడు.
మనందరం కష్టపడితే ఇంకో విజయాన్ని అందుకోగలమని పేర్కొన్నాడు.ఇందుకు సంబంధించి లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ గా మారింది.
Also Read : రష్దీపై దాడి చేసిన వ్యక్తికి నజరానా