Gopichand Malineni : గ‌ద్ద‌ర‌న్న‌కు మ‌ర‌ణం లేదు

ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని

Gopichand Malineni : ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ మ‌ర‌ణం తీర‌ని లోటు అని పేర్కొన్నారు ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు గోపీ చంద్ మ‌లినేని(Gopichand Malineni). ఆయ‌న పాట‌కు చావు లేద‌న్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. త‌న జీవితంలో ఇలాంటి గాయ‌కుడిని చూడ‌లేద‌న్నారు. కోట్లాది మందిని చైత‌న్య‌వంతం చేసిన ఆ పాట‌, ఆ గాత్రం సూర్య చంద్రులు ఉన్నంత కాలం గ‌ద్ద‌ర్ బతికే ఉంటార‌ని పేర్కొన్నారు ద‌ర్శ‌కుడు.

Gopichand Malineni Words

పాటై ప్ర‌వ‌హించి, గాన‌మై గుండెల్ని మీటిన ఈ ప్ర‌జా యుద్ద నౌక గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎందుకంటే ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వంచి చివ‌రి శ్వాస ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జ‌ల కోసం ప‌ల‌వ‌రించిన ఏకైక గాయ‌కుడు గ‌ద్ద‌ర్. ఇవాళ యావ‌త్ తెలంగాణ స‌మాజం తీవ్ర విషాదంలో మునిగి పోయింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారిక లాంఛ‌నాల‌తో నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. వేలాది మంది గ‌ద్ద‌ర్ చివ‌రి చూపు కోసం వ‌స్తున్నారు. అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు ప్ర‌జా గాయ‌కుడి పార్థివ దేహాన్ని ద‌ర్శించుకుని నివాళులు అర్పిస్తున్నారు.

స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి, మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, శ్రీ‌నివాస్ యాద‌వ్ తో పాటు ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ , వినోద్ కుమార్ గ‌ద్ద‌ర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

Also Read : CM KCR : అధికారిక లాంఛ‌నాల‌తో గ‌ద్ద‌ర్ అంత్య‌క్రియ‌లు

Leave A Reply

Your Email Id will not be published!