Graeme Smith & Rahul Tewatia : ట్విట్టర్ కంటే ఆట ముఖ్యం
రాహుల్ తెవాటియాకు గ్రేమ్ సూచన
Graeme Smith & Rahul Tewatia : జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు ఎంచుకున్న పనిపై పోకస్ పెట్టాలి. పక్క దానిపై ఫోకస్ పెడితే ఆశించిన ఫలితం రాదు. ఇలాగే కొనసాగితే కెరీర్ పాడవుతుందంటూ నిప్పులు చెరిగాడు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(Graeme Smith & Rahul Tewatia).
తాను ఎందుకు భారత జట్టుకు ఎంపిక కావడం లేదోనంటూ సోషల్ మీడియా వేదికగా వాపోయాడు రాహుల్ తెవాటియా. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో తాను బాగా రాణించినా తీసుకోవడం లేదంటూ పేర్కొన్నాడు.
తాను ఒకటి తలిస్తే దైవం మరోలా చేస్తోందంటూ దేవుడిపై భారం మోపాడు. రాహుల్ తెవాటియా(Graeme Smith & Rahul Tewatia) చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. క్రికెట్ వర్గాలలో చర్చకు దారి తీశాయి.
దీనిపై మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ స్పందించాడు. ముందు నువ్వు ఆడుతున్న క్రికెట్ లో మంచి పట్టు సాధించేందుకు ప్రయత్నం చేయాలి.
అలా చేయకుండా పొద్దస్తమానం ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తూ పోతే చివరకు ఇలాగే తయారవుతందంటూ చురకలు అంటించాడు.
నీతో ఆట ప్రారంభించన వాళ్లు నీకంటే ముందుకు వెళుతున్నారంటే అర్థం వాళ్ల వైపు అదృష్టం ఉందని కాదు నీ వైపు సరిగా ఆడడం లేదని గుర్తుంచు అని స్పష్టం చేశాడు గ్రేమ్ స్మిత్.
ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారత దేశ క్రికెట్ లో ఇప్పుడు అద్భుతమైన టాలెంట్ ఉంది. ఒకరు లేక పోయినా ఇంకొకరు ఆడేందుకు రెడీగా ఉన్నారు.
ఈ సమయంలో జట్టులో స్థానం పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందన్నాడు. ఇందుకు ఉదాహరణగా దినేష్ కార్తీ, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్ ను చూసి నేర్చుకోవాలని తెవాటియాకు సూచించాడు.
Also Read : కెప్టెన్ల మార్పుపై ద్రవిడ్ కామెంట్స్