GT IPL 2023 Auction : స్టార్ ఆటగాళ్లపై ‘గుజరాత్’ గురి
భారీ ధరకు కేన్ ..శివమ్ మావి కొనుగోలు
GT IPL 2023 Auction : ఐపీఎల్ 2022 ఛాంపియన్ గా అవతరించిన గుజరాత్ టైటాన్స్ తనదైన మార్క్ కొనసాగించింది ఈసారి జరిగిన వేలం పాటలో. సన్ రైజర్స్ వదులుకున్న న్యూజిలాండ్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్ ను కావాలని తీసుకుంది.
అంతే కాదు ఏకంగా శివం మావిని భారీ ధరకు తీసుకోవడం విస్తు పోయేలా చేసింది. వచ్చే ఏడాది 2023లో జరిగే ఐపీఎల్ రిచ్ లీగ్ లో కూడా మరోసారి ఛాంపియన్ గా నిలవాలని అనుకుంటోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు మేనేజ్ మెంట్ సమతూకం పాటించింది.
కేన్ విలిమయ్సన్ బేస్ ధర రూ. 2 కోట్లకు చేజిక్కించుకుంది. విండీస్ ఆల్ రౌండర్ స్మిత్ ను రూ. 50 లక్షలకు, కేఎస్ భరత్ ను తీసుకుంది. ఇక యంగ్ ప్లేయర్ శివమ్ మావిని ఏకంగా రూ. 6 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్(GT IPL 2023 Auction). ఇక తెలుగు వాడైన భరత్ కు రూ. 1.20 కోట్లు ఖర్చు చేసింది.
వరుణ్ అరోన్ , ఫెర్గూసన్ , గుర్బాజ్ , జేసన్ రాయ్ , గురు కీరత్ సింగ్ , డ్రేక్స్ ను విడుదల చేసింది. ఇక రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో నూర్ అహ్మద్ , షమీ, సాంగ్వాన్ , యష్ దయాల్ , రషీద్ ఖాన్ , మాథ్యూ వేడ్ , వృద్ది మాన్ సాహా, విజయ్ శంకర్ , రాహుల్ తెవాటియా , సాయి కిషోర్ , జయంత్ యాదవ్ , దర్శన్ మాల్కండే , సాయి సుదర్శన్ , అభినవ్ మనోహర్ , డేవిడ్ మిల్లర్ , శుభ్ మన్ గిల్ , హార్దిక్ పాండ్యా ఉన్నారు.
మొత్తంగా గుజరాత్ టైటాన్స్ మరోసారి సత్తా చాటేందుకు సిద్దమవుతోంది.
Also Read : ఆటగాళ్ల సమతూకం ఆర్సీబీ అందలం