GT vs DC IPL 2023 : గుజ‌రాత్ జోరుకు బ్రేక్ ప‌డేనా

డేవిడ్ వార్న‌ర్ సేన స‌త్తా చాటేనా

GT vs DC IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ సోమ‌వారం గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ 44వ‌ది. ఇప్ప‌టి దాకా గుజ‌రాత్ టైటాన్స్(GT vs DC IPL 2023) జట్టు 8 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 6 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది. 2 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. ప్ర‌స్తుతం ఐపీఎల్ పాయింట్ల ప‌ట్టిక‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతోంది.

ఇక ఐపీఎల్ లో కేవ‌లం 2 మ్యాచ్ ల‌లో గెలుపొందిన డేవిడ్ వార్న‌ర్ సార‌థ్యం వ‌హిస్తున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఇవాళ బ‌ల‌మైన గుజ‌రాత్ టైటాన్స్ తో త‌ల‌ప‌డ‌నుంది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ బ‌లంగా ఉంది హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్.

ఇక ఐపీఎల్ ఆరంభం లోనే ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు. డేవిడ్ వార్న‌ర్ ఒక్కడే ఇప్ప‌టి దాకా ఆ జ‌ట్టులో అత్య‌ధిక ర‌న్స్ చేశాడు. మొన్న జ‌రిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్ మెరిశాడు. ఆల్ రౌండ్ షోతో ఆక‌ట్టుకున్నాడు. కానీ గెలుపు వాకిట్లో బోల్తా ప‌డ్డారు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో.

ఆ జ‌ట్టును ఢిల్లీ క్యాపిట‌ల్స్ హైద‌రాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో విక్ట‌రీ సాధిస్తే ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో హైద‌రాబాద్ గెలుపొందింది. త‌న ప్ర‌తీకారాన్ని తీర్చుకుంది. మొత్తంగా ఇవాళ జ‌రిగే మ్యాచ్ లో గుజ‌రాత్ జోరుకు ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్రేక్ వేస్తుందో చూడాలి.

Also Read : ల‌క్నో బెంగ‌ళూరు బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!