GT vs MI IPL 2022 : ఉత్కంఠ పోరులో ముంబై విజ‌యం

5 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ ప‌రాజ‌యం

GT vs MI IPL 2022 : ఐపీఎల్ లో కేవ‌లం ఒకే ఒక్క మ్యాచ్ ఓడి పోయి టాప్ రేంజ్ లో కొన‌సాగుతున్న గుజ‌రాత్ టైటాన్స్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది(GT vs MI IPL 2022). 178 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ 172 ప‌రుగులే చేసింది.

దీంతో 5 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. టాస్ ఓడి పోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిషన్ తో పాటు ఆఖ‌రున టిమ్ డేవిడ్ ధాటిగా ఆడ‌డంతో 177 ప‌రుగులు చేసింది.

మైదానంలోకి వ‌చ్చిన గుజ‌రాత్ టైటాన్స్ చివ‌రి దాకా పోరాడింది. ఆఖ‌రున రాహుల్ తెవాటియా అవుట్ కావ‌డం, ఆఖ‌రు ఓవ‌ర్ అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో ప‌రుగులు చేయ‌లేక చేతులెత్తేసింది గుజ‌రాత్ టైటాన్స్.

వృద్ధి మాన్ సాహా 55 ప‌రుగులు చేస్తే శుభ్ మ‌న్ గిల్ 52 ర‌న్స్ చేసి రాణించాడు(GT vs MI IPL 2022). ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా 24 ప‌రుగులు చేసి ప‌ర్వాలేద‌ని అనిపించాడు. కానీ అనుకోని రీతిలో ర‌నౌట్ గా వెనుదిరిగాడు.

మిల్ల‌ర్ ఉన్నా ఫ‌లితం లేక పోయింది. ఇక జోరు మీదున్న సాయి సుద‌ర్శ‌ణ్ 14 ప‌రుగులే చేశాడు. రాహుల్ తెవాటియా సైతం ర‌నౌట్ అయినా స్టార్ హిట్ట‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ 19 ప‌రుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.

ఇక చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో గుజ‌రాత్ ముందు 20 ర‌న్స్ చేయాలి. ఆ జ‌ట్టుకు ఈజీ. 19 వ ఓవ‌ర్ బుమ్రా వేశాడు. ఇప్ప‌టికే భారీగా ప‌రుగులు ఇచ్చుకున్నాడు. 11 ర‌న్స్ ఇచ్చాడు. అంతా గుజ‌రాత్ విజ‌యం ఖాయ‌మ‌ని అనుకున్నారు(GT vs MI IPL 2022).

కానీ 20వ ఓవ‌ర్ లో 9 ప‌రుగులు కావాల్సి వ‌చ్చింది గెల‌వాలంటే. ఆఖ‌రు ఓవ‌ర్ ను డానియ‌ల్ శామ్స్ అద్భుతంగా వేశాడు. మూడు ప‌రుగులే ఇచ్చాడు. ఆఖ‌రి బంతిని డాట్ బాల్ వేయ‌డంతో ముంబై విజ‌యం ఖ‌రారై పోయింది.

 

Also Read : Brendon Mc Cullum : ఇంగ్లండ్ కోచ్ రేసులో మెక్‌కల్లమ్‌

Leave A Reply

Your Email Id will not be published!