Rahul Childrens : హింస కంటే ప్రేమ గొప్ప‌ది – రాహుల్

చిన్నారుల‌తో క‌లిసి భోంచేసిన నేత‌

Rahul Childrens : హింస ఎల్ల‌ప్ప‌టికీ ప్ర‌మాద‌క‌రం. దాని నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొంద‌రు కేవ‌లం విద్వేషాల‌ను రెచ్చగొడుతూ రాజ‌కీయాంగా ల‌బ్ది పొందాల‌ని చూస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు కావాల్సింది హింసోన్మాదం కాదు. వాళ్ల‌కు కావాల్సింది భ‌ద్ర‌త‌మైన జీవితం. అంత‌కు మించి త‌మ పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్తు అని స్ప‌ష్టం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ.

గ‌త కొన్ని రోజులుగా మ‌ణిపూర్ లో తీవ్ర‌మైన హింస చోటు చేసుకుంది. జాతుల మ‌ధ్య చోటు చేసుకున్న ఆధిప‌త్య పోరు చివ‌ర‌కు ఘ‌ర్ష‌ణ‌ల‌కు దారి తీసేలా చేశాయి. ఈ ఘ‌ట‌న‌ల్లో క‌నీసం 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయాల‌కు గుర‌య్యారు. ఆపై 50 ,000 వేల మంది నిరాశ్ర‌యులుగా మారారు. 10 వేల మంది సైనికుల‌ను మోహ‌రించినా ఇప్ప‌టి వ‌ర‌కు అల్ల‌ర్లు, హింస ఓ కొలిక్కి రాలేదు.

ప్ర‌స్తుతం మ‌ణిపూర్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధీనంలో ప్ర‌భుత్వం కొలువై ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షా ప‌ర్య‌టించినా అల్ల‌ర్లు త‌గ్గ‌డం లేదు. ఈ త‌రుణంలో బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు రంగంలోకి దిగారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఈ మేర‌కు ఆయ‌న‌ను వెళ్ల‌నీయ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు పోలీసులు. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కాంగ్రెస్ నేత‌. ఇదే స‌మ‌యంలో బాధితుల కుటుంబాల‌కు చెందిన పిల్ల‌ల‌తో క‌లిసి భోజ‌నం చేశారు రాహుల్ గాంధీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

Also Read : Tulasi Chandu Support : తుల‌సీ చందుకు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు

 

Leave A Reply

Your Email Id will not be published!