Javed Akhtar Shabana Azmi : మా స్నేహం బలీయమైనది
సినీ రచయిత జావేద్ అఖ్తర్ ఆజ్మీ గురించి
Javed Akhtar Shabana Azmi : ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అఖ్తర్ పెళ్లి, స్నేహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో ఫైజ్ ఫెస్టివల్ కు షబానా ఆజ్మీతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తామిద్దరి పెళ్లి గురించి వ్యాఖ్యానించారు. తామిద్దరి మధ్య స్నేహం దృఢంగా ఉందని వివాహం కూడా దానిని విచ్ఛిన్నం చేయలేదన్నారు జావేద్ అఖ్తర్. మా ఇద్దరి మధ్య బంధం బలపడి నాలుగు దశాబ్దాలు అవుతోందని తెలిపారు.
ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకున్నా తామిద్దరం స్నేహితులుగానే ఉన్నామని చెప్పారు. సాహిత్యోత్సవంలో పలు కీలక విషయాలు పంచుకున్నారు స్నేహం లేని ప్రేమ అస్సలు ప్రేమ కాదన్నారు. స్వతంత్రమైన దృఢమైన మనస్సు కలిగిన స్త్రీతో జీవించడం గులాబీలు పరిచిన మంచం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు జావేద్ అఖ్తర్.
ఇదిలా ఉంగా జావేద్ అఖ్తర్ , షబానా ఆజ్మీ(Javed Akhtar Shabana Azmi) 1984 లో పెళ్లి చేసుకున్నారు. జావేద్ అంతకు ముందు స్క్రీన్ రైటర్ హానీ ఇరానీని వివాహం ఆడారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నటుడు ,చిత్ర నిర్మాత ఫర్హాన్ అక్తర్ , చిత్ర నిర్మాత జోయా అక్తర్ , ఇటీవల జరిగిన ఫైజ్ ఫెస్టివల్ లో జావేద్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రేమ పట్ల, పెళ్లి గురించి నిక్కచ్చిగా అభిప్రాయాలు పంచుకోవడం మరింత కలకలం రేపింది.
జావేద్ అక్తర్ మొదటి నుంచీ స్వతంత్రమైన భావాలు కలిగిన వ్యక్తిగా పేరు పొందారు. ఆయన మోదీ సర్కార్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు అప్పట్లో.
Also Read : జీనత్ అమన్ మళ్లీ నటించనుందా