Hanuma Vihari : రెస్టాఫ్ ఇండియా స్కిప్పర్ గా విహారి
జట్టును ప్రకటించిన బీసీసీఐ
Hanuma Vihari : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన ప్రకటన చేసింది. రెస్టాఫ్ ఇండియా టీమ్ కెప్టెన్ గా ఆంధ్రా కుర్రాడు హనుమ విహారిని(Hanuma Vihari) ఎంపిక చేసింది. గురువారం అధికారికంగా వెల్లడించింది.
అక్టోబర్ 1 నుండి 5 వరకు జరిగే ఇరానీ కప్ లో రంజీ వితేలతో తలపడే రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో 16 మంది సభ్యుల తుది జట్టును వెల్లడించింది. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఇరానీ కప్ మూడేళ్ల పాటు నిర్వహించ లేదు.
రెస్ట్ ఆఫ్ ఇండియా జాబితాలో మయాంక్ అగర్వాల్ , విహారి వంటి ఆటగాళ్లతో బలీయమైన లైనప్ ను కలిగి ఉంది. దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరపున ఆడిన ప్రియాంక్ పాంచల్ ను కూడా బీసీసీఐ చేర్చింది.
మరో వైపు గాయం కారణంగా రోహిత్ శర్మ ఆడలేక పోయిన సమయంలో ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సీరీస్ కు కుడి చేతి వాటం కలిగిన పంచల్ ను కూడా పిలిచారు. ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ , ముంబై హిట్టర్ గా ఫామ్ లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరూ జట్టులోకి వచ్చారు.
ఇక ప్రకటించిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ఇలా ఉంది. హనుమ విహారి కెప్టెన్. మయాంక్ అగర్వాల్ , ప్రియాంక్ పంచల్ , అభిమన్యు ఈశ్వరన్ , యశ్ ధుల్ , సర్ఫరాజ్ ఖాన్ , యశస్వి జైస్వాల్ , కేఎస్ భరత్ , ఉపేంద్ర యాదవ్ , జయంత్ యాదవ్ , సౌరభ్ కుమార్ , సాయి కిషోర్ , ముఖేష్ కుమార్ , ఉమ్రాన్ మాలిక్ , నాగ్వా స్వాల్లా ఉన్నారు.
Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ లో సూర్య భాయ్