Rashmika Mandanna : సినీ తెర‌పై వెండి వెన్నెల‌

ఇవాళ న‌టి పుట్టిన రోజు

Rashmika Mandanna : వెండి తెర‌పై త‌న న‌వ్వుతో..న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ర‌ష్మిక మందాన పుట్టిన రోజు ఇవాళ‌. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కొడ‌గు జిల్లా విర‌జ్ పేట ఆమె స్వ‌స్థ‌లం. ఏప్రిల్ 5, 1996లో పుట్టారు ర‌ష్మిక మందాన‌(Rashmika Mandanna). ఆమె వ‌య‌సు ప్ర‌స్తుతం 26 ఏళ్లు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప మూవీ ర‌ష్మిక మందాన‌కు క్రేజ్ తీసుకు వ‌చ్చేలా చేసింది. తాజాగా అహ్మ‌దాబాద్ లో జ‌రిగిన ఐపీఎల్ ప్రారంభ వేడుక‌ల్లో సైతం ఆమె సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది.

2016లో కిరిక్ పార్టీ అనే క‌న్న‌డ చిత్రం ద్వారా ర‌ష్మిక మందాన న‌టిగా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత తెలుగు చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఛ‌లో మూవీలో న‌టించింది. కూర్గ్ ప‌బ్లిక్ స్కూల్ లో చ‌దువుకుంది ర‌ష్మిక మందాన‌. ఎంఎస్ రామ‌య్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామ‌ర్స్ నుండి సైకాల‌జీ , జ‌ర్న‌లిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిల‌ర్ డిగ్రీని పొందారు.

బెంగ‌ళూరు టైమ్స్ 2014లో ప్ర‌క‌టించిన మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 25 మంది జాబితాలో ర‌ష్మిక మందాన 24వ స్థానం పొందింది. 2017లో ఏకంగా మొద‌టి స్థానం సంపాదించింది. ఇదిలా ఉండ‌గా ర‌ష్మికా(Rashmika Mandanna) కిరిక్ పార్టీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో న‌టుడు రక్షిత్ శెట్టితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఒక‌రినొక‌రు ప్రేమించుకున్నారు. జూలై 2017లో నిశ్చితార్థం కూడా జ‌రిగింది. కానీ ఏమైందో ఏమో కానీ విడిపోయారు. ప్ర‌స్తుతం తెలుగు న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

Also Read : బాలీవుడ్ లో న‌టించాల‌ని ఉంది – మాడెన్

2 Comments
  1. G.Muralidhar says

    Queen of expressions in action National crush Rasmika Mandonna ( from Andhrapradesh)

  2. G.Muralidhar says

    Queen 👑 of expressions in action, National crush Rasmika Mandonna. ( from Andhrapradesh)

Leave A Reply

Your Email Id will not be published!