Harbhajan Singh : రూ. 7 కోట్లు ఇస్తే వ‌స్తా లేదంటే బై బై

చీఫ్ సెలెక్ట‌ర్ కోసం భ‌జ్జీ కండీష‌న్

Harbhajan Singh BCCI : అత్య‌ధిక ఆదాయం క‌లిగిన బీసీసీఐకి ఇప్పుడు చీఫ్ సెలెక్ట‌ర్ ప‌ద‌వి త‌లనొప్పిగా మారింది. ఇప్ప‌టికే రాజ‌కీయాలు చోటు చేసుకోవ‌డంతో ఎవ‌రు వ‌చ్చినా కార్య‌ద‌ర్శి జే షా ఏది చెబితే అదే న‌డుస్తుంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఈ త‌రుణంలో నోరు పారేసుకుని ఉన్న పోస్ట్ ను కూడా పోగొట్టుకున్న చేత‌న్ శ‌ర్మ స్థానంలో ఇప్పుడు ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే దానిపై బీసీసీఐ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. చీఫ్ సెలెక్ట‌ర్ ప‌ద‌వి రేసులో మాజీ క్రికెట‌ర్ , ఆప్ ఎంపీ హ‌ర్బ‌జ‌న్ సింగ్ తో పాటు వీరేంద్ర సెహ్వాగ్ కూడా రేసులో ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా హ‌ర్భ‌జ‌న్ సింగ్(Harbhajan Singh BCCI) అలియాస్ భ‌జ్జీ కండీష‌న్ పెట్టిన‌ట్లు టాక్. ప్ర‌స్తుతం భారత క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కు వార్షిక వేత‌నం రూ. 7 కోట్లు చెల్లిస్తోంది బీసీసీఐ. అయితే చీఫ్ సెలెక్ట‌ర్ కు రూ. 1 కోటి మాత్ర‌మే ఇస్తోంది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. హెడ్ కోచ్ కు స‌మానంగా త‌న‌కు వేత‌నం ఇస్తే వ‌స్తాన‌ని లేకుంటే త‌న‌కు ఇష్టం లేద‌ని క‌రాఖండిగా చెప్పిన‌ట్లు టాక్. పురుషుల జ‌ట్టుకు జాతీయ సెలెక్ట‌ర్ గా ఉండాలంటే నాకు సంతృప్తిని క‌లిగించేలా వేత‌నం ఉండాల‌ని స్ప‌ష్టం చేశాడు.

ఒక‌రికి ఒక లాగా మ‌రొక‌రికి ఇంకోలా ఇస్తామంటే కుద‌ర‌ద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు హ‌ర్బ‌జ‌న్ సింగ్. ఒక‌వేళ సెహ్వాగ్ ను ఎంపిక చేయాల‌ని అనుకుంటే బీసీసీఐ ఇచ్చే వేత‌నం కంటే ఎక్కువ‌గా బ‌య‌ట సంపాదిస్తాడ‌ని అన్నాడు. ఈ స‌మ‌యంలో ఫోక‌స్ అంతా ఆట‌, ఆట‌గాళ్ల‌పై పెట్టాల్సి ఉంటుంద‌న్నాడు. ఇంత‌గా క‌ష్ట‌ప‌డి చివ‌ర‌కు రూ. 1 కోటి ఇస్తే ఎందుకు స‌రిపోతుంద‌ని ప్ర‌శ్నించాడు. క‌నీసం రూ. 7 కోట్లు ఇస్తే బెట‌ర్ అని భ‌జ్జీ బాంబు పేల్చాడు.

Also Read : ద్ర‌విడ్ ను విమ‌ర్శించ‌ని గ‌వాస్క‌ర్

Leave A Reply

Your Email Id will not be published!