Hardeep Singh Puri: GST 2.0 భారత జీడీపీని 0.8శాతం పెంచుతాయి – కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి
GST 2.0 భారత జీడీపీని 0.8శాతం పెంచుతాయి - కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి
Hardeep Singh Puri : కొత్తగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (GST) సంస్కరణలు మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని కేంద్ర చమురు, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) చెప్పారు. ఇది మన స్థూల దేశీయోత్పత్తి (GDP)ని 0.8 శాతం వరకు పెంచగలవని ఆయన వెల్లడించారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు.
Hardeep Singh Puri Key Comments
GST సరళీకరణ, సమర్థవంతమైన అమలు ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని పూరి (Hardeep Singh Puri) అభిప్రాయపడ్డారు. GST సంస్కరణలు వ్యాపారాలకు సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా, పన్ను విధానంలో పారదర్శకతను మెరుగుపరుస్తాయని తెలిపారు. ఇది పెట్టుబడులను ఆకర్షించడంలో, ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, GST విధానంలో సమన్వయం, సరళీకరణ ద్వారా చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన పరిగణించారు. GST కౌన్సిల్ ఈ సంస్కరణలపై చర్చించి, ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం చేయాలని భావిస్తోందని పూరి చెప్పారు.
మోదీపై ప్రశంసలు కురిపించిన అమిత్‌షా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢమైన పనితీరుపై ఆయన మంత్రివర్గ సహచరుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (ప్రశంసలు కురిపించారు. గత 24 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని ఏకైక నేత మోదీ అని చెప్పారు. దేశ రాజకీయ చరిత్రలో చెక్కుచెదరని నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు.
‘గత 24 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని ఒకే ఒక్క వ్యక్తిని నేను చూశాను. ఆయనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇంతటి నిబద్ధత ఆషామాషీగా వచ్చేది కాదు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం వల్లేనే ఇది సాధ్యమైంది’ అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్‌షా చెప్పారు.
దేశం మునుపెన్నడూ చూడని ప్రజాకర్షణ కలిగిన ప్రధానమంత్రి మోదీ అని, ఇటు స్వదేశంలోనూ, అంతర్జాతీయంగానూ అత్యంత జనాకర్షణ కలిగిన ప్రధానిగా పేరుతెచ్చుకున్నారని అమిత్‌షా పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు కూడా దీనిని బలంగా విశ్వసిస్తున్నాయని చెప్పారు. అదే విధంగా ఒక ప్రధానిగా, ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలందించిన ఘనత కూడా మోదీదేనని అన్నారు.
దేశ విదేశాంగ విధానానికి గతంలో వెన్నెముక లేదని, మోదీ తన హయాంలో వెన్నెముక కలిగిన విదేశాంగ విధానాన్ని రూపొందించారని అమిత్‌షా ప్రశంసించారు. మోదీ జర్నీని ప్రస్తావిస్తూ… స్థానిక స్థాయిలో పార్టీ కార్యకర్తగా కెరీర్ ప్రారంభించి బీజేపీ జాతీయ నేతగా ఎదిగారని, ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాయని, ఆ తర్వాత అత్యంత జనాకర్షణ కలిగిన ప్రధానిగా నిలిచారని తెలిపారు. మోదీ పనితీరును దగ్గరుండి చూసే అదృష్టం తనకు కలిగిందని కూడా చెప్పారు.
Also Read : Kamal Haasan: విజయ్ ర్యాలీపై కమల్ హాసన్ సంచలన కామెంట్స్
