Hardik Pandya : మాథ్యూ వేడ్ వివాదంపై పాండ్యా కామెంట్

థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యం స‌రైన‌దేన‌న్న కెప్టెన్

Hardik Pandya : ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2022లో అంపైర్లు తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప‌లు వివాదాల‌ను రాజేస్తున్నాయి. ఇప్ప‌టికే మైదానంలో ఉన్న ఇద్ద‌రు అంపైర్లతో పాటు థ‌ర్డ్ అంపైర్ సైతం ప‌లుమార్లు తీసుకున్న డెసిష‌న్ల‌పై సాంకేతికంగా ప‌రిశీలించి అవుటా కాదా అన్న‌ది నిర్ణ‌యిస్తున్నారు.

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ కింద గుజ‌రాత్ టైటాన్స్ కు చెందిన ఆట‌గాడు మాథ్యూ వేడ్ ప్ర‌వ‌ర్తించిన తీరు ప‌ట్ల స‌ర్వ‌త్రా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. తీవ్ర రాద్దాంతం చెల‌రేగ‌డంతో చివ‌ర‌కు గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) స్పందించారు.

ప‌రిస్థితిని చ‌క్కదిద్దే ప్ర‌య‌త్నం చేశారు. ఆర్సీబీతో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో గుజ‌రాత్ 8 వికెట్ల తేడాతో ఓడి పోయింది. ఇప్ప‌టికే ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు చేరింది. మొత్తం 14 మ్యాచ్ లు ఆడి ఆ జ‌ట్టు 10 మ్యాచ్ ల‌లో గెలుపొంది నాలుగు మ్యాచ ల‌లో ప‌రాజ‌యం పాలైంది.

ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న అంపైర్ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ మాథ్యూ వేడ్ ప్ర‌వ‌ర్తించిన తీరు ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. లెగ్ బిఫోర్ వికెట్ గా వెనుదిరిగాడు.

పెవిలీయ‌న్ కు వ‌చ్చిన మాథ్యూ వేడ్ డ్రె్స్సింగ్ రూమ్ లోకి వ‌చ్చి హెల్మెట్, బ్యాట్ ను నేల‌కేసి విసిరేశాడు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ క‌మిటీ. మొద‌టిసారి క్ష‌మించి వ‌దిలి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్భంగా పాండ్యా(Hardik Pandya) స్పందిస్తూ సాంకేతికంగా చూశాక నిర్ణ‌యం తీసుకుని ఉంటార‌ని తాను అనుకుంటున్న‌ట్లు తెలిపాడు. ఇదిలా అల్ట్రా ఎడ్జ్ లో కొద్దిగా ఉంద‌ని, పెద్ద స్క్రీన్ నుండి అది క‌నిపించ లేద‌న్నాడు.

ఎందుకంటే మీరు త‌ప్పు చేయ‌లేర‌న్నాడు. సాంకేతిక స‌హాయం చేయ‌క పోతే ఇంకెవ‌రు చేస్తార‌ని ప్ర‌శ్నించాడు పాండ్యా.

Also Read : మాథ్యూ వేడ్ నిర్వాకంపై ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!