Hardik Pandya : పంజాబ్ పై విక్ట‌రీ కిక్ ఇవ్వ‌లేదు

గుజ‌రాత్ టైటాన్స్ స్కిప్ప‌ర్ పాండ్యా

Hardik Pandya GT IPL  : మొహాలీ లోని పీఏసీ స్టేడియంలో జ‌రిగిన కీల‌క పోరులో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టుపై 6 వికెట్ల తేడాతో పాండ్యా సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్(Hardik Pandya GT IPL) గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి 153 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. ఈ విజ‌యం తేలికగా ల‌భించ‌లేదు.

శుభ్ మ‌న్ గిల్ 49 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 1 సిక్స్ తో 67 ర‌న్స్ చేస్తే వృద్ది మాన్ సాహా 30 ర‌న్స్ తో రాణించ‌డంతో గెలుపు సాధ్య‌మైంది. విచిత్రం ఏమిటంటే డిఫెండింగ్ ఛాంపియ‌న్ 19.5 ఓవ‌ర్ల‌లో గెలుపొందింది. బౌలింగ్ ప‌రంగా గుజ‌రాత్ స్టార్ బౌల‌ర్ మోహిత్ శ‌ర్మ రాణించాడు. 4 ఓవ‌ర్లు వేసిన శ‌ర్మ 18 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

కేవ‌లం ఒకే ఒక్క బంతి దూరంలో విజ‌యం సాధించడాన్ని తాను తేలిక‌గా తీసుకోద‌ల్చు కోలేద‌న్నాడు కెప్టెన్ పాండ్యా. మ్యాచ్ గెలుపొందిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఒక ర‌కంగా చివ‌రి దాకా పోరాడాల్సి వ‌చ్చింది. ఈ విక్ట‌రీ సుల‌భంగా ల‌భించ‌లేద‌ని స్ప‌ష్టం చేశాడు పాండ్యా. రాబోయే మ్యాచ్ ల‌లో ఇంకా స‌త్తా చాటాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నాడు కెప్టెన్.

Also Read : ఆ క్రెడిట్ అంతా మలింగ‌..శాంస‌న్ దే

Leave A Reply

Your Email Id will not be published!