Harish Rao : స్పీక‌ర్ కు హ‌రీశ్ రావు లేఖ

ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ కు ఛాన్స్ ఇవ్వండి

Harish Rao : హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డిసెంబ‌ర్ 20 బుధ‌వారం నుండి శాస‌న స‌భ స‌మావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా హ‌రీశ్ రావు రాష్ట్ర శాస‌న స‌భ స‌భాప‌తి గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ కు మంగ‌ళ‌వారం లేఖ రాశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు మాజీ మంత్రి.

Harish Rao Letter to Speaker

శాస‌న స‌భ‌లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చేందుకు, త‌మ వాద‌న‌ను తెలియ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. శాస‌న స‌భ స‌మావేశాల‌లో ఆర్థిక‌, సాగునీటి , విద్యుత్ అంశాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం ఉంద‌ని తెలిపారు.

ఒక వేళ స‌ర్కార్ కు అనుమ‌తి ఇచ్చిన‌ట్ల‌యితే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్ర‌తినిధుల‌కు స‌భ ద్వారా త‌మ వాద‌న వినిపించేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని లేఖ‌లో కోరారు త‌న్నీరు హ‌రీశ్ రావు(Harish Rao). తాము కూడా ఎక్క‌డెక్క‌డ ఖ‌ర్చు చేశామ‌నేది కూడా చెప్పేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

స్పీక‌ర్ గా త‌మ‌రు ద‌య‌తో ప‌రిశీలించి అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. ఇదిలా ఉండా త‌న్నీరు లేఖ రాయ‌డం ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read : Salaar Movie Rates : స‌లార్ బెనిఫిట్ షోకు సీఎంలు ఓకే

Leave A Reply

Your Email Id will not be published!