Harish Rao : అధ్య‌క్షా గొంతు నొక్కితే ఎలా

మాజీ మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌శ్న‌

Harish Rao : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర శాస‌న స‌భ‌లో మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. నాలుగో రోజు ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల తూటాలు పేల్చారు. ప్ర‌ధానంగా మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి మ‌ధ్య తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసుకునే స్థాయికి వెళ్లారు. ఒకానొక ద‌శ‌లో ప‌రిస్థితి అదుపు త‌ప్పేలా క‌నిపించింది. దీనిని ముందుగానే గ‌మ‌నించిన స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశారు.

Harish Rao Shocking Comment

గ‌తంలో ఏలిన పాల‌కుల‌పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుల కుప్ప‌గా మార్చేసి, పూర్తిగా పాల‌న‌ను ప‌క్క‌దారి ప‌ట్టించిన ఘ‌న‌త మీదేనంటూ ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో డ్ర‌గ్స్ రాష్ట్రంలో వేళ్లూనుకుని పోయింద‌ని, దానిని కూక‌టి వేళ్ల‌తో పెకిలించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇందుకోసం ఎందుకు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు రేవంత్ రెడ్డి.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై తీవ్రంగా స్పందించారు త‌న్నీరు హ‌రీశ్ రావు(Harish Rao). అంద‌రికీ మాట్లాడేందుకు స‌మాన అవ‌కాశాలు ఇస్తామంటూనే త‌మ గొంతు నొక్కేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం బాధ్య‌త‌ల‌ను మ‌రిచి త‌మ‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. అందుకే తాను మాట్లాడాల్సి వ‌స్తోంద‌న్నారు.

ఆనాడు స‌భ‌లో కేవ‌లం 5 మంది ఎమ్మెల్యేలు ఉన్న‌ప్ప‌టికీ మాట్లాడేందుకు ఛాన్స్ ఇచ్చిన విష‌యం గుర్తు పెట్టుకోవాల‌న్నారు హ‌రీశ్ రావు.

Also Read : Kishan Reddy : ఒంట‌రి గానే ఎన్నిక‌ల్లోకి

Leave A Reply

Your Email Id will not be published!