Harmanpreet Kaur : ఐసీసీ ప్లేయర్ ఆప్ ది మంత్ ‘కౌర్’
పురుషుల విభాగంలో రిజ్వాన్
Harmanpreet Kaur : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ ఎంపికైంది. టీమిండియా మహిళల తరపున మొట్టమొదటి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది కౌర్.
ప్రతి నెల నెలా ఐసీసీ ఆ నెలలో ఆట పరంగా అద్బుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన బ్యాటర్, బౌలర్, ఆల్ రౌండర్ విభాగాలలో వ్యక్తిగతంగా ఆటగాళ్లను మహిళలు, పురుషుల విభాగాల్లో ఎంపిక చేస్తుంది. ఇదిలా ఉండగా సెప్లెంబర్ నెలకు గాను ఐసీసీ ఎంపిక చేసింది.
మహిళా విభాగంలో హర్మన్ ప్రీత్ కౌర్ ఎంపిక కాగా పురుషుల విభాగంలో పాకిస్తాన్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యారు. హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) బ్యాటింగ్ తో మాత్రమే కాకుండా కెప్టెన్ గా కూడా అద్బుతమైన విజయాలు సాధించేలా చేస్తోంది. దీంతో భారత్ కు ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సీరీస్ ను 3-0తో దక్కేలా చేసింది.
కాగా 1999 తర్వాత ఇంగ్లండ్ లో భారత్ కు ఇదే మొదటి సీరీస్ విజయం. ఇదిలా ఉండగా భారత మహిళా స్టార్ గా పేరొందిన వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన సైతం తన ర్యాంకును పదిల పర్చుకుంది.
బంగ్లాదేశ్ క్రికెటర్ నిగర్ సుల్తానాను దాటేసింది. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది మంధాన. ఈ సందర్భంగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు హర్మన్ ప్రీత్ కౌర్. అంతే కాదు నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నన్ను మరింత ముందుకు వెళ్లేలా చేస్తుందన్నారు.
Also Read : భారత్ తడాఖా థాయిలాండ్ విలవిల