Harnaaz Sandhu : భారత దేశానికి చెందిన మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు సంచలన కామెంట్స్ చేసింది. భారత దేశంలో కలకలం రేపిన కర్ణాటక హిజాబ్ వివాదం పై స్పందించింది. హిజాబ్ ధరించడం గురించి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ పేర్కొంది.
ఎవరి ఇష్టం మేరకు వారు బతికే స్వేచ్ఛ ఉంది. వారి మానాన వారు బతికేలా స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయ పడింది సంధు. హిజాబ్ వివాదంలో వారు ఎంచుకున్న విధంగా వారిని జీవించనీయండి అని స్పష్టం చేయడం కలకలం రేగింది.
హిజాబ్ రో పై అమ్మాయిలను టార్గెట్ చేయడం మాను కోవాలని మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు (Harnaaz Sandhu)కోరింది. ఇదిలా ఉండగా కర్ణాటక హైకోర్టు హిజాబ్ ధరించడం అన్నది తప్పనిసరి కాదని తీర్పు చెప్పింది.
దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇంకా విచారణ పూర్తి కాలేదు. శిరోజాలు ముఖ్యమైన మత పరమైన ఆచారం కాదని, నిర్దేశించిన విద్యా సంస్థల్లో ఏకరీతి దుస్తుల నిబంధనను అనుసరించాలని స్పష్టం చేసింది.
ఓ మీడియా ప్రతినిధి హిజాబా వివాదం పై అడగడంతో సంధు స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలను కావాలని ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తున్నారని ఎందుకని ప్రశ్నించింది.
హిజాబ్ లో కూడా వారిని లక్ష్యంగా చేసుకోవడం మానుకోవాలన్నారు. ఈ సందర్భంగా తాను మిస్ యూనివర్స్ గా ఎంపిక కావడానికి ఎన్నో అడ్డంకులు అధిగమించి వచ్చానని సంధు చెప్పారు. సంధు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : అసాధారణ విజేతల అనుభవాల గొంతుక