Harry Brook : దంచి కొట్టిన హ్యారీ బ్రూక్
ఐపీఎల్ లో సెంచరీతో పరేషాన్
Harry Brook : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఇప్పటి దాకా జరిగిన మ్యాచ్ లలో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయిన హైదరాబాద్ పరుగుల వర్షం కురిపించింది. ఆ జట్టుకు చెందిన హ్యారీ బ్రూక్ పూనకం వచ్చినట్లు ఆడాడు. కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 228 పరుగులు చేసింది.
దీంతో కేకేఆర్ ముందు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో అత్యధిక పరుగులు హ్యారీ బ్రూక్ వే కావడం విశేషం. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ బ్రూక్ నిప్పులు చెరిగాడు. కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హ్యారీ బ్రూక్ 100 రన్స్ చేశాడు. ఇందులో 12 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. చివరి దాకా ఉన్నాడు. అతడికి తోడు సన్ రైజర్స్ హైదరాబాద్ స్కిప్పర్ ఐడెన్ మార్క్రామ్ రెచ్చి పోయాడు. 26 బంతులు మాత్రమే ఎదుర్కొని 50 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి.
కేకేఆర్ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ 22 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 41 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు ఎవరూ అంతగా ప్రభావం చూపలేక పోయారు. మొత్తంగా హ్యారీ బ్రూక్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ సీజన్ లో సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచాడు.
Also Read : వారెవ్వా రింకూ సింగ్ అదుర్స్