Supreme Court : ద్వేషపూరిత ప్రసంగాలు దేశానికి ప్రమాదం
సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్
Supreme Court : భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా ద్వేష పూరిత ప్రసంగాలపై సీరియస్ గా స్పందించింది. ఇలాంటి ప్రసంగాలు దేశానికి మేలు చేయవని ప్రజల మధ్య మరిన్ని విధ్వంసాలు చెలరేగుతాయన్న వాస్తవాన్ని గుర్తించాలని హెచ్చరించింది.
ధర్మ సన్సద్ లో విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఉత్తరాఖండ్ , ఢిల్లీ ప్రభుత్వాల నుండి ఒక ప్రత్యేక కేసులో సుప్రీంకోర్టు స్పందన కోరింది. ఇదిలా ఉండగా కొన్ని ద్వేష పూరిత ప్రసంగాల ఘటనలపై అఫిడవిట్ ఇచ్చేందుకు పిటిషనర్ కు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది.
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోని మైనార్టీలపై విద్వేషపూరిత ప్రసంగాలపై చేసిన పిటిషన్ లో ఈ రకమైన బహిరంగ చర్చల కారణంగా మొత్తం వాతావరణం చెడి పోతోందని , అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పడం సరైనదేనని అభిప్రాయపడింది.
గత ఏడాది రాష్ట్రం , దేశ రాజధానిలో జరిగిన ధరమ్ సన్సద్ లలో ద్వేష పూరిత ప్రసంగాలు చేసిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ప్రతిస్పందనను కూడా సుప్రీంకోర్టు(Supreme Court) కోరింది. ఢిల్లీలోని విశ్వ హిందూ పరిషత్ , ఇతర నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇక్కడ కొంత మంది వక్తలు ద్వేష పూరిత ప్రసంగాలు చేశారని ఆరోపించారు. పధాన న్యాయమూర్తి యుయు లలిత్ , జస్టిస్ ఎస్. ఆర్. భట్ లతో కూడిన ధర్మాసనం విచారణ సమయంలో తీసుకున్న చర్యలతో సహా ద్వేష పూరిత ప్రసంగాలకు సంబంధించిన ప్రత్యేక సందర్భాల వివరాలను ఇవ్వాలని పిటిషనర్ హెచ్. మన్సుఖానీని కోరింది.
Also Read : డిసెంబర్ 19న కిసాన్ గర్జన ర్యాలీ – బీకేఎస్