Sanju Samson : సంజూ శాంస‌న్ ను ప‌క్క‌న పెట్టేశారా

భ‌గ్గుమంటున్న క్రికెట్ ఫ్యాన్స్

Sanju Samson : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్వాకంపై మ‌రోసారి భ‌గ్గుమంటున్నారు క్రికెట్ అభిమానులు. ప్ర‌ధానంగా బంగ్లాదేశ్ టూర్ కు సందీప్ కిష‌న్ తో పాటు వ‌రుస‌గా ఫెయిల్ అవుతూ వ‌స్తున్న రిష‌బ్ పంత్ ను ఎంపిక చేసింది. వ‌న్డే సీరీస్ తో పాటు టెస్టు సీరీస్ కు ష‌మీకి గాయం కావ‌డంతో ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేసిన‌ట్లు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ప్ర‌క‌టించారు.

కానీ సంజూ శాంస‌న్ విష‌యంలో ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు రిష‌బ్ పంత్ 11 ఇన్నింగ్స్ లు ఆడితే 10 ఇన్నింగ్స్ ల‌లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. కానీ శాంస‌న్ ను పూర్తిగా ప‌క్క‌న పెట్టడంపై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన న్యూజిలాండ్ టూర్ లో కూడా టి20 సీరీస్ లో బెంచ్ కు ప‌రిమితం చేశారు.

ఇక వ‌న్డే సీరీస్ లో ఒక్క మ్యాచ్ ఆడించారు. 38 మంతులు ఎదుర్కొని 36 ర‌న్స్ చేశాడు సంజూ శాంస‌న్(Sanju Samson). కానీ అటు టి20 సీరీస్ లో ఇటు వ‌న్డే సీరీస్ లో పూర్తిగా దూరం పెట్ట‌డంపై బీసీసీఐపై, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ , పాండ్యా, శిఖ‌ర్ ధావ‌న్ పై భ‌గ్గుమ‌న్నారు. వ‌చ్చే ఏడాది 2023లో భార‌త్ లో ఇంట‌ర్నేష‌నల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 50 ఓవ‌ర్ల వ‌న్డే టోర్నీ జ‌ర‌గ‌నుంది.

వైట్ బాల్ క్రికెట్ లో సంజూ శాంస‌న్ రిష‌బ్ పంత్ కంటే అద్భుతంగా ఆడ‌గ‌ల‌డ‌ని ఇప్ప‌టికే పేర్కొన్నారు ప్ర‌ముఖ కామెంటేట‌ర్లు హ‌ర్ష భోగ్లే, సైమ‌న్ డౌల్ . అంతే కాదు పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ డానిష్ క‌నేరియా అయితే బీసీసీఐ అనుస‌రిస్తున్న తీరుపై సీరియ‌స్ గా స్పందించాడు. రిష‌బ్ పంత్ కంటే శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు అని కొనియాడారు.

Also Read : భార‌త్ ఓట‌మికి ఎన్నో కార‌ణాలు

Leave A Reply

Your Email Id will not be published!