HCA EX Members : అజారుద్దీన్ ఓ నియంత అక్రమాల పుట్ట
హెచ్‌సీఏ మాజీ కార్యవర్గ సభ్యుల ఆరోపణ
HCA EX Members : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ ) పదవీ కాలం ముగియనుంది. దీంతో మరోసారి రగడ మొదలైంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ క్రికెట్ ను భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రపంచంలోనే టాప్ క్రికెటర్ గా పేరొందిన మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ అధ్యక్షుడిగా ఎంపికైనా ఇప్పటి వరకు ఎలాంటి ప్రగతి లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.
ఎప్పటి లాగే ప్రస్తుత పాలక వర్గం ఈ సెప్టెంబర్ తో పూర్తవుతుంది. అజ్జూ భాయ్ పై మాజీ కార్యవర్గ సభ్యులు అర్షద్ అయూబ్ , శివ లాల్ యాదవ్ , శేష్ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు.
వారు మీడియాతో మాట్లాడారు. అజహరుద్దీన్ ఓ నియంత. అక్రమాలకు అడ్డా అంటూ మండిపడ్డారు. కాసుల కక్కుర్తితో పూర్తిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను భ్రష్టు పట్టించాడంటూ ఆరోపించారు.
అపెక్స్ కౌన్సిల్ , ఏజీఎం, హెచ్ సీ ఏ(HCA EX Members) రాజ్యాంగం దేన్నీ ఖాతరు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడని, ఇదేమిటని ప్రశ్నిస్తే వారిని వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పాలనా వ్యవహారాలు గాడి తప్పినా ఎవరూ నోరు మెదప వద్దంటూ ఆదేశాలు కూడా జారీ చేశాడన్నారు. బీసీసీఐ నుంచి వచ్చే నిధులకు ఇప్పటి దాకా లెక్కా పత్రం లేకుండా పోయిందన్నారు.
గత మూడేళ్లలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదిక కాక పోవడం దారుణమన్నారు. ప్రతిభకు పాతరేస్తూ పైసలు ఇచ్చే వాళ్లకే ప్రయారిటీ ఇస్తున్నారంటూ ఆరోపించారు.
Also Read : బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం