HCA Failure Comment : టికెట్ల వ్య‌వ‌హారం అజ్జూ వైఫ‌ల్యం

హెచ్ సీఏలో ఏం జ‌రుగుతోంది

HCA Failure Comment :  దేశంలో ఎక్క‌డా లేని రీతిలో హైద‌రాబాద్ లో టికెట్ల లొల్లి చోటు చేసుకోవ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ఒక‌ప్పుడు భార‌త క్రికెట్ కు ఎన‌లేని విజ‌యాలు స‌మ‌కూర్చి పెట్టిన మ‌ణిక‌ట్టు మాంత్రికుడు మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ హైద‌రాబాద్(HCA Failure) క్రికెట్ అసోసియేష‌న్ కు చీఫ్ గా ఉన్నా ఫ‌లితం లేకుండా పోయింది.

భార‌త్, ఆసిస్ మ‌ధ్య మూడో టి20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే బీసీసీఐ త‌న డేట్ ను ఫిక్స్ చేసింది. టికెట్ల కోసం పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చేరుకోవ‌డం, పోలీసుల లాఠీఛార్జి చోటు చేసుకోవడం, ప‌లువురికి గాయాలు కావ‌డం మ‌రింత ఉద్రిక్త‌త‌ను పెంచేలా చేసింది.

జింఖానా గ్రౌండ్స్ వ‌ద్ద తీవ్ర‌మైన తొక్కిస‌లాట చోటు చేసుకుంది. అజ్జూ భాయ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయ‌న‌కు టీఆర్ఎస్ ప‌రంగా మ‌ద్ద‌తు ల‌భించింది.

అజ‌హ‌రుద్దీన్ అంటే ఇక్క‌డే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. కానీ ఆచ‌ర‌ణ‌లో ఆయ‌న వ్య‌వ‌హార శైలిలో పూర్తిగా భిన్నంగా ఉంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

తాను వ‌స్తే క్రికెట్ లో పెను మార్పులు తీసుకు వ‌స్తాన‌ని చెప్పాడు. కానీ అన్నీ వివాదాలే చోటు చేసుకున్నాయి. అజ్జూ కార‌ణంగా హైద‌రాబాద్ , తెలంగాణ బ్రాండ్ కు ప్ర‌మాదం ఏర్ప‌డిందంటూ స‌ర్కార్ ఆందోళ‌న చెందుతోంది.

హెచ్‌సీఏ పద్ధతి మార్చు కోకపోతే స్టేడియానికి ఇచ్చిన భూమి లీజును రద్దు చేస్తామంటూ హెచ్చ‌రించే దాకా వెళ్లింది వ్య‌వ‌హారం.

ఇదిలా ఉండ‌గా టి20 మ్యాచ్ టికెట్ల విక్ర‌యంలో రూ. 40 కోట్ల దాకా కుంభ‌కోణం జ‌రిగింద‌ని(HCA Failure) తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గురవారెడ్డి ఆరోపించారు.

అజారుద్దీన్ వ‌న్ మ్యాన్ షో వ‌ల్లే ఈ ప‌రిస్థితి నెల‌కొంద‌ని మండిప‌డ్డారు. ప్లేయ‌ర్ల సెల‌క్ష‌న్స్ నుంచి టికెట్ క‌లెక్ష‌న్ల దాకా అజార్ బేజారిత్తిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

అజ‌ర్ వేలు పెడితే వివాదం కాలు ఎత్తిత్తే క‌య్యం కుర్చీ ఎత్తేస్తే పాలనా అంతా అస్త‌వ్య‌వ‌స్తంగా మారింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అజ్జూ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా ఎందుక‌నో ప‌రిపాల‌న స‌జావుగా సాగ‌డం లేద‌న్న మాట వినిపిస్తోంది.

దేశంలో రెండు చోట్ల ఇలాంటి మ్యాచ్ లు జ‌రిగాయి. కానీ ఇక్క‌డ జ‌రిగినంత తొక్కిస‌లాట‌, విమ‌ర్శ‌లు ఎక్క‌డా చోటు చేసుకోలేదు. ఉప్ప‌ల్ స్టేడియం కెపాసిటీ 55 వేలు. 38 వేల టికెట్ల‌లో కేవ‌లం 3 వేల టికెట్లు మాత్ర‌మే ఉన్నాయంటే ఏమ‌నుకోవాలి.

అజ‌హ‌రుద్దీన్ వైఫ‌ల్యమా లేక హెచ్సీఏ దౌర్భాగ్య‌మా అన్న‌ది వేచి తేలాల్సి ఉంది.

Also Read : 2023లో మ‌హిళ‌ల ఐపీఎల్ – గంగూలీ

Leave A Reply

Your Email Id will not be published!