Swaminathan Aiyar : హిండెన్ బ‌ర్గ్ నివేదిక అదానీకి హెచ్చ‌రిక‌

స్వామినాథ‌న్ అయ్య‌ర్ షాకింగ్ కామెంట్స్

Swaminathan Aiyar : అమెరికాకు చెందిన హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక ఒక ర‌కంగా అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌతం అదానీకి ఓ హెచ్చ‌రిక లాంటిద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ముఖ ఆర్థిక వేత్త స్వామి నాథ‌న్ అయ్య‌ర్(Swaminathan Aiyar). అదానీ గ్రూప్ విస్త‌రిస్తున్న బ్రేక్ నెస్ స్పీడ్ మంద‌గించ‌డం ద్వారా లాభ ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.

ఒక ర‌కంగా ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను తీసుకు రాగ‌ల‌ద‌ని ఆర్థిక వేత్త అభిప్రాయ‌ప‌డ్డారు. హిండెన్ బ‌ర్గ్ నివేదికలో వాస్త‌వాలు ఉన్నాయా లేవా అన్న‌ది ప‌క్క‌న పెడితే కీల‌క‌మైన అంశం ఏమిటంటే అదానీ గ్రూప్ మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించేలా చేసింద‌ని స్ప‌ష్టం చేశారు.

అధిక ధ‌ర‌లు , అధిక రిస్క్ అన్న‌ది వ్యాపారంలో ఎప్పుడూ ఉండేదే. యాపిల్స్ టు ఎయిర్ పోర్ట్ ల స‌మ్మేళ‌నం వ‌ర‌కు అదానీ విస్త‌రించి ఉన్నారు. స్టాక్ మానిప్యులేష‌న్ ను స‌క్ర‌మంగా ఉప‌యోగించ లేద‌ని హిండెన్ బ‌ర్గ్ నివేదిక బ‌ట్ట‌బ‌య‌లుచేసింది. దీని దెబ్బ‌కు ఒక్క‌సారిగా అదానీ గ్రూప్ షేర్లు ప‌డి పోయాయి. వ‌ర‌ల్డ్ వైడ్ గా కుబేరుల జాబితాలో టాప్ 5లో ఉన్న గౌతం అదానీ ఒక్క‌సారిగా 22వ స్థానానికి ప‌డి పోయాడు. అదానీ గ్రూప్ లోని ఏడు లిస్టెడ్ కంపెనీలు మార్కెట్ వాల్యూలో దాదాపు $125 బిలియ‌న్లు కోల్పోయాయి. 

అదానీ(Adani) అరువుగా తీసుకున్న డ‌బ్బును ఉప‌యోగించి విప‌రీత‌మైన వేగంతో వైవిధ్య భ‌రితంగా విస్త‌రిస్తోంది. వేలం, కొనుగోళ్ల‌లో చాలా ఎక్కువ ధ‌ర‌ల‌కు బిడ్డింగ్ చేసింది. ఇది వేగ‌వంత‌మైన విస్త‌ర‌ణ‌ను సుల‌భ‌త‌రం చేస్తుంద‌ని, దీని వ‌ల్ల కంపెనీకి ఎక్కువ న‌ష్టం వాటిల్లుతుంద‌ని స్ప‌ష్టం చేశారు స్వామినాథ‌న్ అయ్య‌ర్.

Also Read : విప్రో వాత వేత‌నాల్లో కోత

Leave A Reply

Your Email Id will not be published!