#HindiLanguage : భరత జాతి ఐక్యతకు దోహదం చేస్తున్న హిందీ
Hindi contributing to the ethnic unity of India
భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏక తాటిపై నడిపి, హిందీ భాష ఆనాడు దోహద పడిందనే భావనతో గాంధీజీ స్ఫూర్తితో, 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని జాతీయ భాషగా గుర్తిస్తూ పొందు పరిచారు. ఈ నిర్ణయాన్ని 1950 జనవరి 26 న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ఆమోదించింది. అలా ప్రతి ఏటా నుండి సెప్టెంబర్ 14వ తేదీని “హిందీ దివస్” (రాష్ట్ర భాషా దినోత్సవం) గా, జనవరి 26ను “అధికార భాషగా స్వీకరించిన దినం”గా గుర్తించడం జరుగు తున్నది.
ప్రశంసలు పొందిన భారతీయ పండితుడు, చరిత్రకారుడు, వేదాంత వేత్త, సాహితీ వేత్త, హిందీ పండితుడు, సర్వోదయ కార్యకర్త, గాంధేయ వాది, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, సంస్కృత భాషపై సాధికారికత కలిగిన, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బీయాహర్ రాజేంద్ర సింహా, 1949 సెప్టెంబర్ 14 న తన 50 వ పుట్టిన రోజున, హిందీని అధికారిక భాషగా స్వీకరించిన తరువాత వారి ప్రయత్నాలు ఫలించాయి. ఈ మేరకు హిందీకి అనుకూలంగా బియాహర్ రాజేంద్ర సింహాతో పాటు హజారీ ప్రసాద్ ద్వివేది, కాకా కలేల్కర్, మైథిలి శరణ్ గుప్త్, సేథ్ గోవింద్ దాస్ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ భారత రాజ్యాంగ సభ భారత దేశ రిపబ్లిక్ యొక్క రెండు అధికారిక భాషలలో దేవనాగరి లిపిలో వ్రాయబడిన ఒకటిగా హిందీని రాజ్యాంగ సభ ఆమోదంతో స్వీకరించింది.
1949 సెప్టెంబరు 14వ తేదీన హిందీని జాతీయ భాషగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, ఈ నిర్ణయం 1950 జనవరి 26 న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ఆమోదించింది. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 343 ప్రకారం, దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీని అధికారిక భాషగా స్వీకరించారు. మొత్తం మీద, భారత దేశంలో 22 షెడ్యూల్డ్ భాషలు ఉన్నాయి, వాటిలో రెండు అధికారికంగా యూనియన్ స్థాయిలో ఉపయోగించ బడతాయి:
హిందీ, ఇంగ్లీష్. అధికారిక భాష హిందీ దేవనాగరిక లిపి నుంచి రూపొందించ బడింది. ఈ భాష ఇండో యూరోపియన్ భాష సంతతికి సంబంధించిన ఇండో-ఆర్యన్ శాఖకు చెందినది. హిందీ అంటే “పర్షియన్ కానుక” అని అర్థం. హిందీ” మరియు “హిందూ” అనే పదాలు పాత పర్షియన్ కు చెందినవి, ఇవి “సింధు నది”ని సూచించే సంస్కృత పేరు సింధు నుండి వచ్చాయి. దీని అర్ధం ” హింద్ (భారత దేశం) యొక్క లేదా చెందినది”. హిందీ భాష చాలా వరకూ సంస్కృతం నుంచి గ్రహించ బడినది.
అయితే కాలక్రమంలో ఉత్తర భారత దేశం లోని ముస్లిం ప్రభావం వల్ల పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష ఆవిర్భవించింది. మనం శుద్ధ హిందీ(ప్యూర్ హిందీ) భాషను రేడియోలలో, టి.వి. వార్తలలో వినవచ్చు. ప్రస్తుతం చలామణిలో ఉన్న హిందీ భాష చాలా వరకూ సులభతరం చేయ బడింది.
ఉత్తర భారత దేశంలో ఇస్లామిక్ పరిపాలన వచ్చిన తరువాత, పాత హిందీ పెర్షియన్, అరబిక్ నుండి అనేక రుణ పదాలను సంపాదించింది. ఇది హిందూస్థానీ అభివృద్ధికి దారి తీసింది. అవధి మరియు బ్రజ్ భాష వంటి సాహిత్య ప్రామాణీకరణ ద్వారా హిందీ బెల్ట్ యొక్క వివిధ మాండలికాలు, భాషలు ప్రాముఖ్యతను సంతరించు కున్నాయి. మొఘల్ కాలం (1800 లు) చివరి భాగంలో భాషా ప్రతిష్టను పొందింది. ఆధునిక హిందీ, దాని సాహిత్య సంప్రదాయం 18 వ శతాబ్దం చివరిలో ఉద్భవించింది. ముందుగా దీనిని ఉత్తర భారత దేశం భాషగా (ప్రస్తుత పాకిస్తాన్ తో సహా ) బ్రిటిష్ వలస వాదులు, స్వదేశీ ప్రజలు స్వీకరించారు. 19 వ శతాబ్దం చివరలో, ఉర్దూ నుండి వేరుగా ఉన్న హిందూస్థానీ యొక్క ప్రామాణిక రూపంగా హిందీని మరింత అభివృద్ధి చేసే ఉద్యమం ఏర్పడింది.
జాతిపిత మహాత్మా గాంధీ కూడా దేశంలో ఐక్యతను తీసుకు రావడానికి ఈ భాషనే వాడేవారు. ఈ భాషను “లాంగ్వేజ్ ఆఫ్ యూనిటి” అనేవారు. 9 రాష్ట్రాల్లో, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో అధికార భాష కాగా, 3 రాష్ట్రాల అదనపు అధికార భాష.
బీహార్, ఛత్తీస్‌గడ్, గుజరాత్ (అదనపు), హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మిజోరం (అదనపు), రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ (బ్లాక్స్, డివిజన్లు లేదా 10 శాతం కంటే ఎక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో) అండమాన్ మరియు నికోబార్ దీవులు, దాద్రా మరియు నగర్ హవేలి, డామన్ డయ్యూ, ఢిల్లీలలో రాజ్య మేలుతోంది.
1954 లో, భారత ప్రభుత్వం హిందీ వ్యాకరణాన్ని సిద్ధం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది; కమిటీ నివేదిక 1958 లో “ఎ బేసిక్ గ్రామర్ ఆఫ్ మోడరన్ హిందీ”గా విడుదలైంది. రాతలో ఏక రూపతను తీసుకు రావడానికి, కొన్ని దేవనాగరి అక్షరాల ఆకారాన్ని మెరుగు పరచడానికి, అలాగే ఇతర భాషల నుండి శబ్దాలను వ్యక్తీకరించ డానికి కృషి జరిగింది. ఇతరులు అర్దం చేసు కోవడాన్ని సులభమైన బాష హిందీ ఒక్కటేనని గుర్తు చేశారు. ప్రపంచంలోని చాలా దేశాలలో హిందీ భాష మాట్లాడుతారు.
భారత దేశం వెలుపల, హిందీ మాట్లాడేవారు నేపాల్ లో 8 మిలియన్లు, యూ.ఎస్.ఏ లో 8,63,077, మారిషస్ లో 4,50,170; ఫిజీలో 3,80,000; దక్షిణాఫ్రికాలో 2,50,292; సురినామ్‌లో 1,50,000; ఉగాండాలో 1,00,000; యునైటెడ్ కింగ్‌డమ్‌లో 45,800; న్యూజిలాండ్‌లో 20వేలు, జర్మనీలో 20వేలు, ట్రినిడాడ్ మరియు టొబాగోలో 26వేలు, సింగపూర్‌లో 3 వేలు, మారిషస్, ట్రినిడాడ్, అమెరికా, దక్షిణాఫ్రికా, న్యూజిల్యాండ్ వంటి చాలా దేశాలలో ఇప్పటికీ హిందీ ముఖ్య భాషగా ఉంది.
ఆసియా వెలుపల , భోజ్‌పురి , బిహారీ భాషలు , ఫిజియన్ మరియు ఇంగ్లీష్ ప్రభావంతో అవధి భాష (తూర్పు హిందీ మాండలికం) ఫిజీలో మాట్లాడ బడుతోంది. ఇది ఫిజీలో 1997 రాజ్యాంగం ప్రకారం “హిందుస్తానీ” గా పిలువబడే అధికారిక భాష.
అయితే 2013 ఫిజి రాజ్యాంగంలో దీనిని ” ఫిజి హిందీ ” అని పిలుస్తారు. ఫిజీలో 3.8 లక్షల మంది మాట్లాడు తున్నారు. 2011 నేపాల్ జనాభా లెక్కల ప్రకారం నేపాల్‌లో సుమారు 77,569 మంది హిందీని మొదటి భాషగా, ఇంకా 1,225,950 మంది రెండవ భాషగా మాట్లాడతారు.
దక్షిణాఫ్రికాలో రక్షిత భాషగా, రాజ్యాంగం ప్రకారం,దక్షిణాఫ్రికా భాషా బోర్డు ఇతర భాషలతో పాటు హిందీ పట్ల గౌరవాన్ని ప్రోత్సహిస్తున్నది. ఉర్దూ మాట్లాడే చాలా మంది పాకిస్తానీయులకు హిందీ అర్థం చేసుకోవడం చాలా సులభం. ఇది హిందీ మాదిరిగానే హిందూస్థానీ భాష యొక్క ప్రామాణిక రిజిస్టర్; ఆధునిక హిందీ నేడు 250 మిలియన్లకు పైగా ప్రజలకు మొదటి భాషగా, 1.8 బిలియన్ల ప్రజలు మాట్లాడే భాషగా ఉంది. అంటే దేశంలో 1/8 వ ప్రజలు ఉపయోగించే భాషగా, దేశాన్ని ఏకం చేసే భాషగా హిందీ గుర్తించ బడుతోంది. జాతీయ భాషగా వర్ధిల్లుతోంది.
హిందీ నేర్చు కోవడానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్టికల్ 351 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన భాషలో పని చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నాయి. స్థానికేతర హిందీ మాట్లాడే వారిపై బలవంతపు రుద్దడానికి విస్తృతమైన ప్రతిఘటన, ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో (తమిళనాడు వంటివి) 1963 అధికారిక భాషల చట్టం ఆమోదించడానికి దారితీసింది. ప్రపంచం లోనే ఎక్కువగా మాట్లాడే భాషలలో ఒకటిగా హిందీ భాషకు ప్రత్యేక గుర్తింపు ఉండడం గమనార్హం.
అయితే మాతృభాషపై ఉన్న మమకారముతో సంబంధిత రాష్ట్రాలలో ప్రతివారికి విద్యా విధానాలు అందాలంటే తప్పని సరిగా మాతృభాష లోనే చదువు కోవాలి. విభిన్న భాషలు ఉన్న భారత దేశములో ఒకరి భావావేశాలు మరొకరు అర్ధము చేసు కునేందుకు ఒక కనీస ఉమ్మడి భాష అవసరము ఎంతైనా ఉంది. ప్రపంచ దేశాల ప్రజలతో సంభాషించేందుకు ఇంగ్లీష్ కు ఉన్న ప్రాముఖ్యత మరియే ఇతర భాషకు లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి అవుతున్నది.
ఈ విధంగా హిందీయేతర ప్రాంతాలలో మూడు భాషలు నేర్చుకోవడం కష్టతరము, ఇబ్బందులకు హేతువు అవుతుంది. కనుక హిందీని తప్పనిసరిగా నేర్చుకోమని బలవంత పెట్టకూడ దనేది విద్యావేత్తల అభిప్రాయం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకే ప్రాథమిక దశలో విద్యార్థులకు మాతృ భాషలో విద్య నేర్చుకునే విషయంపై ప్రధానంగా దృష్టి నిలిపింది.

No comment allowed please