Hindu Row Chola Comment : తమిళ గళం హిందూ వివాదం
చోళ రాజ్యంలో హిందూ మతం లేదు
Hindu Row Chola Comment : సమున్నత భారత దేశంలో లెక్కలేనన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు పెట్టింది పేరు. ప్రపంచంలో ఎక్కడా
లేని విధంగా భిన్నత్వంలో ఏకత్వం అన్న భావన కొనసాగుతోంది. భాషాభిమానం అన్నది తమిళనాడులో ఉన్నంత ఎక్కడా లేదన్నది వాస్తవం.
తమిళులు దేనినైనా భరిస్తారు కానీ తమపై , తమ భాషపై, ఆత్మాభిమానంపై దెబ్బ కొడితే తట్టుకోలేరు. గతంలో అటల్ బిహారి వాజ్ పేయ్ సారథ్యంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి వివాదాలు చెలరేగిన దాఖలాలు లేవు.
కానీ ఎప్పుడైతే నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కొలువు తీరిందో గత ఎనిమిదేళ్లలో లెక్కలేనన్ని కేసులు , వివాదాలు చోటు చేసుకున్నాయి.
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలన్నీ ఒకే జాతి ఒకే దేశం ఒకే భాష ఒకే పౌరసత్వంగా ఉండాలని కంకణం కట్టుకుంది.
ఆ దిశగా పావులు కదుపుతోంది. అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా హిందీ భాషను తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసింది కేంద్రం. దీనిపై పెద్ద
ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. తమిళనాడులో ఉవ్వెత్తున నిరసన జ్వాలలు ఎగసి పడ్డాయి. విధ్వంసం కూడా చోటు చేసుకుంది.
తమకు మీ భాష అక్కర్లేదంటూ కుండ బద్దలు కొట్టారు సీఎం ఎంకే స్టాలిన్. మిగతా రాష్ట్రాలలో సైతం ఇదే విధమైన ఆందోళన వ్యక్తమైంది. చివరకు తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై స్వతహాగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
దీంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి మోదీ(PM Modi) మిగతా భాషలను తక్కువ చేయడం లేదని కేవలం దీనిని వ్యవహార భాషగా వాడాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు.
తాజాగా మరో వివాదానికి తెర లేపింది చోళ రాజుల పాలనకు సంబంధించి. ప్రముఖ తమిళ సినీ దర్శకుడు వెట్రిమారన్ చేసిన కామెంట్స్ దేశంలో కలకలం రేపింది. ఆయన ఏమన్నారంటే చోళుల నాటి కాలంలో హిందువులు, హిందూ మతం లేదని స్పష్ట చేశారు. అంతే కాకుండా చోళ రాజు(Hindu Row Chola) హిందువు కానే కాదన్నారు.
ఇక వెట్రిమారన్ కు సంపూర్ణ మద్దతు పలికారు దిగ్గజ నటుడు కమల్ హాసన్. ఆయన మరో అడుగు ముందుకేసి హిందూ పదం అన్నది మతం కాదని
దానిని మొదటగా ఆంగ్లేయులు ఉపయోగించారని స్పష్టం చేశారు. తమిళులు మొదటి నుంచి ఉత్తరాది ఆధిపత్యాన్ని తాము సహించ బోమంటూ ప్రకటించారు.
ప్రస్తుతం వెట్రిమారన్ , కమల్ హాసన్ కు పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులు మద్దతు తెలిపారు. తమపై ఇంకొకరి పెత్తనాన్ని సహించ
బోమంటూ ప్రకటించారు.
మొత్తంగా తమిళులు వర్సెస్ బీజేపీ మధ్య విమర్శలు, ఆరోపణలు పక్కన పెడితే ఏ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన చోళ రాజులకు సంబంధించి
రాసిన నవల ఆధారంగా మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ మూవీ వరల్డ్ వైడ్ గా రికార్డులు బద్దలు కొడుతోంది.
ఏది ఏమైనా తమిళ గళం ఇప్పుడు హిందూ వివాదం మధ్య ఏది కరెక్టు అనేది తెలుసు కోవాలంటే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
Also Read : ఇంకెన్నాళ్లీ రైతుల ఆత్మహత్యలు