Fischer CEO : ఫిస్కర్ లో మరికొందరి నియామకం
ఫిస్కర్ సిఇఓ హెన్రిక్ ఫిస్కర్ కామెంట్
Fischer CEO : గతంలో దేశంలో ఐటీ అంటే బెంగళూరు అని పేరుండేది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీన్ మారింది. ప్రస్తుతం దేశానికే తలమానికంగా నిలిచింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ తదితర రంగాలలో ముందంజలో కొనసాగుతోంది.
ప్రత్యేకించి సర్కార్ తీసుకు వచ్చిన ఐటీ పాలసీ ఆదర్శంగా మారింది. కేవలం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతి ఇచ్చేలా పాలసీని రూపొందించారు. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. అంతే కాదు ఎవరిని దేబరించాల్సిన పని ఉండదు. పైరవీలు, మధ్య దళారీలు, ఉన్నతాధికారులకు సలాం కొట్టడం అంటూ ఉండదు.
దీని వల్ల పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ప్రధానంగా ప్రపంచంలో పేరొందిన దిగ్గజ కంపెనీలు, సంస్థలు భాగ్యనగరాన్ని ఎంచుకుంటున్నాయి. ఇప్పటికే ఒరాకిల్, గూగుల్, పొలారిస్, మైక్రోసాఫ్ట్ , అమెజాన్ ఇలా బడా సంస్థలు ఇక్కడ కొలువుతీరాయి.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వాణిజ్య విధానాలు అద్భుతంగా ఉన్నాయంటూ కితాబు ఇచ్చారు ఫిస్కర్ సిఈఓ(Fischer CEO) హెన్రిక్ ఫిస్కర్ . అమెరికాలో విద్యుత్ ఆధారిత వాహనాలను తయారు చేస్తోంది ఈ సంస్థ. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న తమ సంస్థలో 50 మంది పని చేస్తున్నారని త్వరలో ఆ సంఖ్యను 500కు పెంచుతామని చెప్పారు.
మరో వైపు దేశ వ్యాప్తంగా విద్యుత్ వాహనాల తయారీకి ప్రయారిటీ పెరిగింది. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వీటికి హెవీ డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉండగా కీలక వ్యాఖ్యలు చేశారు ఫిస్కర్ సిఇఓ. దేశంలోని పలు ప్రాంతాలను పర్యటించాం. కానీ అన్నిటి కంటే ప్రభుత్వ విధానాలు తమకు బాగా నచ్చాయన్నారు.
Also Read : మూడో స్థానానికి పడి పోయిన అదానీ