AAP Victory : దేశ రాజకీయాలను శాసిస్తూ వస్తున్న ప్రధాన పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన అఖండ విజయం ఓ చెంపపెట్టు లాంటిది. ఇది ఎవరూ ఊహించని ఫలితాలివి.
ప్రజలు సామాన్యుడికే పట్టం కట్టారు. దళిత కార్డు పేరుతో సీఎం పదవి కట్టబెట్టిన చరణ్ జిత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలోనూ ఓటమి పాలయ్యారు.
నిత్యం సెటైర్లతో విరుచుకు పడుతూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ కలిగిన మాజీ క్రికెటర్, హోస్ట్, పీసీసీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూను సాగనంపారు.
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అకాలీదళ్ చీఫ్ బాదల్ , మజిథియా, మాజీ సీఎం పాటియాలా కంచు కోటగా భావించే కెప్టెన్ అమరీందర్ సింగ్ ను పక్కన పెట్టేశారు.
ఇది పూర్తిగా ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ఈ తీర్పు దేశానికి కనువిప్పు కావాలి.
అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 117 సీట్లలో 92 సీట్లను కైవసం చేసుకుంది. 60 ఏళ్ల చరిత్రను తిరగ రాసింది.
గతంలో అకాలీదళ్ ఈ మార్కును సాధించింది. ఆ తర్వాత అతి పెద్ద సంఖ్యా బలాన్ని సాధించి తనకు
ఎదురే లేదని చాటి చెప్పింది. ఆప్ త్వరలోనే దేశంలో ఇప్పటికే ఢిల్లీలో కొలువు తీరగా ఇప్పుడు పంజాబ్ లో పవర్ లోకి రానుంది.
ఇదిలా ఉండగా 1997లో శిరోమణి అకాలీదళ్ – బీజేపీ కలిసి ఈ సంఖ్యను సాధించాయి.
ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP Victory )మరోసారి తన పవర్ ఏమిటో రుచి చూపించింది. 2017లో జరిగిన ఎన్నికల్లో 20 సీట్లకే పరిమితమైన ఆప్ ఇప్పుడు 92 సీట్లకు ఎదిగింది.
పాలనా పరంగా కూడా ఆప్ తనదైన శైలిలో స్పందించింది. సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తన ఫోటో ఉండదన్నాడు. ప్రమాణ స్వీకారం భగత్ సింగ్ పుట్టిన ఊరులో ఉంటుందన్నాడు.
ప్రతి ఆఫీసులో భగత్ సింగ్ , అంబేద్కర్ ఫోటో పెట్టాలని స్పష్టం చేశాడు. పాలనా పరంగా మరిన్ని సంస్కరణలు తీసుకు వస్తామన్నాడు
భగవంత్ మాన్. అంతే కాదు ఒక్క నెలలో తామేమిటో నిరూపించు కుంటామని, అది మీరు చూస్తారని స్పష్టం చేశాడు.