Home Minister Amit Shah: మావోయిస్టులు లొంగిపోవాల్సిందే – అమిత్‌ షా

మావోయిస్టులు లొంగిపోవాల్సిందే - అమిత్‌ షా

Amit Shah : ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపదని..ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. ఆ విధంగా లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని..పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్తర్‌ జిల్లాలో శనివారం ఆయన ‘బస్తర్ దసరా లోకోత్సవ్’ కార్యక్రమంలో మాట్లాడుతూ… మావోయిస్టులతో చర్చలు జరిపే అవసరం లేదని స్పష్టం చేశారు. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని పునరుద్ఘాటించారు.

Indian Home Minister Amit Shah Comments

మావోయిస్టులు తమతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని… ఇప్పుడు వారితో మాట్లాడడానికి ఏముందని ప్రశ్నించారు. బస్తర్‌ అంతటా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో శాంతికి విఘాతం కలిగించే వారికి భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తాయని మావోయిస్టులను హెచ్చరించారు.

మావోయిస్టులను మార్చి 31, 2026 నాటికి నిర్మూలిస్తామని… వారితో చర్చల ప్రసక్తే లేదంటూ అమిత్‌ షా (Amit Shah) తేల్చి చెప్పారు. మావోయిస్టులతో ఇక చర్చల ప్రసక్తే లేదన్న అమిత్‌ షా.. లొంగిపోవాల్సిందేనన్నారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామని.. లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామంటూ అమిత్‌ షా పేర్కొన్నారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధి కోసం రూ.4లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని..భవిష్యత్తులో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయి. బస్తర్ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి నక్సలిజమే. బస్తర్ శాంతికి భంగం కలిగిస్తే భద్రతా బలగాలు తగిన రీతిలో సమాధానం చెబుతాయంటూ అమిత్‌ షా హెచ్చరించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి రూ. 4 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. మావోయిజం వల్ల తప్పుదారి పట్టినవారు హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలంటూ అమిత్‌ షా పిలుపునిచ్చారు.

Also Read : Delhi Court: సిగరెట్‌ తాగుతూ అర్ధనగ్నంగా కోర్టు విచారణలో ప్రత్యక్షమైన వ్యక్తి

Leave A Reply

Your Email Id will not be published!