RSS : స్వలింగ సంపర్కం ఓ రుగ్మత – ఆర్ఎస్ఎస్
దేశ వ్యాప్తంగా సర్వేలో వెల్లడి
RSS : దేశ వ్యాప్తంగా స్వలింగ సంపర్క వివాహాలపై చట్ట బద్దతకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. దీనిని సీజేఐ ధనంజయ వై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం గత కొన్ని రోజులుగా విచారిస్తోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మోదీ ప్రభుత్వం కోర్టుకు ఇది మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో స్వలింగ సంపర్క వివాహ చట్ట బద్దతపై దేశ వ్యాప్తంగా సర్వే చేపట్టింది. ఇందులో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్ఎస్ఎస్. స్వలింగ సంపర్కం అనేది ఒక రుగ్మత అని, దానికి గనుక చట్టబద్దత కల్పిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో బీజేపీ స్టాండ్ ఏమిటనేది తేలి పోయింది. దీని వల్ల సమాజంలో మరింత ప్రమాదకర పోకడలను పెంచేలా చేసినట్లు అవుతుందని పేర్కొంది. ఇది రుగ్మతను ప్రోత్సహిస్తుందని స్పష్టం చేసింది.
దీని గురించి పలువురు వైద్యులు, వైద్య నిపుణులు విశ్వసిస్తున్నారని వెల్లడించింది. ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం అనుబంధ సంస్థ సంవర్దిని న్యాస్ సర్వేలో తేలిందని తెలిపింది. రాష్ట్ర సేవికా సమితి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కి సమాంతరంగా ఉన్న మహిళా సంస్థ సీనియర్ కార్యకర్త ఆధునిక శాస్త్రం ఎనిమిది విభిన్న చికిత్సా విధానాల నుండి వైద్య అభ్యాసకులను కవర్ చేస్తూ దేశ వ్యాప్తంగా 318 ప్రతిస్పందనల ఆధారంగా ఈ సర్వేలో కనుగొన్నట్లు పేర్కొంది.
Also Read : ఉగ్రవాద పరిశ్రమకు భుట్టో ప్రతినిధి