Rahul Dravid : గెలుపు కంటే ఎలా ఆడామన్నదే ముఖ్యం
భారత క్రికెట్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
Rahul Dravid : క్రికెట్ లో ఏ జట్టు ఎప్పుడు గెలుస్తుందో చెప్పలేం. ఒక్కోసారి అనుకున్న జట్లు ఆశించిన మేర రాణించక పోవచ్చు. ఇంకోసారి ఊహించని జట్లు విజయాలు సాధించవచ్చు.
ప్రధానంగా టెస్టులు, వన్డేల కంటే టి20 పొట్టి ఫార్మాట్ లో ఉత్కంఠ నెలకొనడం ఖాయం. నా దృష్టిలో గెలుపు సాధించడం కంటే ఆట ఎలా ఆడామన్నది ముఖ్యమని స్పష్టం చేశారు భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid).
యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ -2022 మెగా టోర్నీలో హాట్ ఫెవరేట్ గా ఉన్న టీమిండియా ఊహించని రీతిలో సూపర్ -4 నుంచి నిష్క్రమించింది. కీలకమైన రెండు మ్యాచ్ లలో పాకిస్తాన్ తో , శ్రీలంకతో వరుసగా ఓటమి మూటగట్టుకుంది.
టోర్నీ నుంచి నిష్క్రమించింది. చివరి నామమాత్రపు మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పై 111 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసినా లాభం లేక పోయింది.
అసలు జట్టు ఎంపికలో సమతుల్యత లేదన్న విమర్శలు ఉన్నాయి. అసలు ద్రవిడ్ ఏం చేస్తున్నాడనే దానిపై ఆరోపణలు వస్తున్నాయి.
ఈ తరుణంలో జట్టు కూర్పు, ఎంపిక, ఆట ఆడిన తీరుపై రాహుల్ ద్రవిడ్ సంజయ్ మంజ్రేకర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయాలను పంచుకున్నాడు.
వరుస ఓటములపై తాను ఏమీ మాట్లాడ దల్చుకోలేదన్నాడు. టి20లో ప్రతి బంతి ముఖ్యమైదని పేర్కొన్నాడు ద్రవిడ్. ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం. ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమన్నాడు.
హెడ్ కోచ్ ద్రవిడ్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
Also Read : జూలు విదిల్చిన రన్ మెషీన్