Kantara Movie : కాసుల వ‌ర్షం కురిపిస్తున్న ‘కాంతార’

క‌న్న‌డ నాట సెన్సేష‌న్ ఇత‌ర బాష‌ల్లో అదుర్స్

Kantara Movie : క‌న్న‌డ నాట మ‌రో సంచ‌ల‌నంగా మారింది కాంతార చిత్రం(Kantara Movie). క‌న్న‌డ‌లో తీసిన ఈ సినిమా ప‌లు భాష‌ల్లో విడుద‌లై బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. తెలుగు వెర్ష‌న్ లో కేవ‌లం రెండు రోజులలో రూ. 10 కోట్లు సాధించింది. ఇక హిందీ వెర్ష‌న్ లో రూ. 4.2 కోట్లు వ‌సూలు చేసింది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన చిత్రంగా కాంతార నిలిచింది.

ఇది ఓ రికార్డు. గ‌త కొంత కాలంగా స్థ‌బ్దుగా ఉన్న సినీ రంగంలో కొత్త‌గా వ‌చ్చిన సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. హీరో హీరోయిన్ల కంటే క‌థలో ద‌మ్ముంటే ఏ సినిమానైనా జ‌నం ఆద‌రిస్తార‌ని చెప్పేందుకు ఈ కాంతార ఓ ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే.

ఇక ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు ఇటీవ‌లే విడుద‌లైన మ‌ణిరత్నం తీసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రం. ఇది కూడా ఏకంగా వంద‌ల కోట్ల‌కు ద‌గ్గ‌ర‌లో ఉండ‌డం విశేషం. క‌న్న‌డ‌లో తీసిన ఈ చిత్రం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వారాంతంలో హిందీ, త‌మిళం, తెలుగు భాష‌ల్లో డ‌బ్ చేసి విడుద‌ల చేశారు.

ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాల ప్ర‌కారం ఇత‌ర భాష‌ల్లో కూడా కాంతార దుమ్ము రేపుతోంది. త‌న‌కు ఎదురే లేద‌ని చాటుతోంది. ఓ వైపు పొన్నియిన్ సెల్వ‌న్ ఇంకో వైపు చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ గాడ్ ఫాద‌ర్ ఉన్నా కాంతార అంచ‌నాల‌కు మించి ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. సినీ వ‌ర్గాల‌ను సైతం విస్తు పోయేలా చేస్తోంది.

ఇక ఈ చిత్రంలో రిష‌బ్ శెట్టి, కిషోర్ , అచ్యుత్ కుమార్ , స‌ప్త‌మి గౌడ‌, ప్ర‌మోద్ శెట్టి , త‌దిత‌రులు న‌టించారు. ద‌ర్శ‌క‌త్వంతో పాటు రిష‌బ్ శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ను పోషించాడు.

Also Read : బాల‌య్య షోకి భారీగా వ్యూస్

Leave A Reply

Your Email Id will not be published!