Tirumala : శ్రీవారి దర్శనం భక్త సందోహం
71,9345 మంది భక్తుల దర్శనం
Tirumala : పుణ్య క్షేత్రంగా వినుతి కెక్కిన తిరుమలకు భక్తుల తాకిడి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వేసవి కాలంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తోంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి పెద్ద ఎత్తున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి సిఫార్సు లెటర్లు తీసుకు వచ్చే వారికి కాకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న వారికి త్వరగా దర్శన భాగ్యం అయ్యేలా కృషి చేస్తున్నారు.
ప్రధానంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి అహోరాత్రుళ్లు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉండగా దర్శనంలో భాగంగా జూన్ 20న మంగళవారం ఒక్క రోజే 71,835 మంది శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మను దర్శించుకున్నారు. ఇక తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 31,831 కి చేరుకుంది.
గత రెండు మూడు రోజులలో భక్తులు పెరిగాన ఇవాళ వచ్చినంతగా హుండీ ఆదాయం రాక పోవడం విశేషం. నిన్న ఒక్క రోజే హుండీ కానుకల ద్వారా రూ. 4.11 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం భక్తులు 17 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి కనీసం 15 గంటల సమయం పట్టవచ్చని టీటీడీ తెలిపింది.
Also Read : TTD Yoga Day : తిరుమలలో యోగా దినోత్సవం