Rahul Gandhi Yatra : ప్రజా యాత్రకు జనం బ్రహ్మరథం
ఎర్రకోటకు చేరుకున్న భారత్ జోడో యాత్ర
Rahul Gandhi Yatra : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. శనివారం ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది.
ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని కరోనా రూల్స్ పాటించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లేఖ రాయడం కలకలం రేపింది. భారీ ఎత్తున పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే కాదు స్వచ్చందంగా వివిధ వర్గాలకు చెందిన వారు రాహుల్ గాంధీ యాత్రలో(Rahul Gandhi Yatra) పాలు పంచుకున్నారు.
పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఈ సందర్బంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఇప్పటికే ఉన్న నఫ్రత్ కా బజార్ అంటే ద్వేష పూరిత మార్కెట్ మధ్‌య మొహబ్బత్ కీ దుకాన్ అంటే ప్రేమ దుకాణం తెరవడే తన యాత్ర ఉద్దేశమని మరోసారి స్పష్టం చేశారు.
ఢిల్లీ గుండా కవాతు చేస్తున్న సమయంలో వేలాది మంది జోడో యాత్రలో చేరడం విస్తు పోయేలా చేసింది. ఈ యాత్రలో పార్టీ నేతలు జైరాం రమేష్ , పవన్ ఖేరా, భూపిందర్ సింగ్ హూడా, కుమారి సెల్జా, రణదీప్ సూర్జేవాలాతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా రాహుల్ గాంధీతో జత కట్టారు. ఇదిలా ఉండగా సోనియా పాల్గొనడం ఈ యాత్రలో రెండోసారి కావడం విశేషం. ఆమె మొదటగా కర్ణాటకలో జరిగిన యాత్రలో పాల్గొన్నారు. ఇక ప్రియాంక గాంధీ మధ్య ప్రదేశ్ లో జరిగిన యాత్రలో పాల్గొన్నారు.
ఇక భారత్ జోడో యాత్ర ఇవాళ ఉదయం ఫరీదాబాద్ నుండి దేశ రాజధానిలోకి ప్రవేశించింది. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అనిల్ చౌదరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికారు రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు. దేశంలోని ప్రతి సామాన్యుడు ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి రాష్ట్రంలో లక్ష లాది మది చేరారని అన్నారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.
Also Read : రాహుల్ గాంధీ అంటే బీజేపీకి భయం