Virat Kohli : ఫామ్ నాకో లెక్క కాదు – రన్ మెషీన్
సత్తా చాటుతా నేనేంటో చూపిస్తా
Virat Kohli : భారత స్టార్ క్రికెటర్ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గత కొంత కాలంగా పేలవమైన ఆట తీరుతో తీవ్ర నిరాశ పరిచాడు. కోట్లాది మంది అభిమానులు కలిగిన ఈ క్రికెటర్ ఒకప్పుడు టన్నుల కొద్దీ పరుగులు చేశాడు.
సెంచరీలు, హాఫ్ సెంచరీలతో మోత మోగించాడు. ఫోర్లు, సిక్సర్లు దంచి కొట్టాడు. ప్రస్తుతం జట్టులో ఉంటాడో లేదోనన్న స్థితికి చేరుకున్నాడు.
దీనిపై ఇప్పటికే బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. కోహ్లీని(Virat Kohli) యూఏఈ వేదికగా జరుగుతున్న మెగా ఆసియా కప్(Asia Cup 2022) కు ఎంపిక చేసింది. ఆగస్టు 27 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా దాయాది దేశాలైన భారత్ , పాకిస్తాన్ జట్ల మధ్య ఆగస్టు 28న మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో కోహ్లీ ఫామ్ పై ఉత్కంఠ నెలకొంది. మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర కామెంట్స్ చేశాడు కోహ్లీపై.
ఒక్కసారి 50 రన్స్ చేస్తే ఇక అతడిని ఆపడం ఎవరి తరం కాదంటూ పేర్కొన్నాడు. ఇప్పటికే టోర్నీలో ఆడేందుకు యూఈఏకి చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడాడు.
ఫామ్ తనకు ఓ సమస్య కాదని, ఇప్పటికే వందలాది మంది బౌలర్లను ఎదుర్కొన్నానని అన్నాడు. పరుగులు తీయడం తనకు లెక్క కాదన్నాడు.
ఈసారి తన సత్తా ఏమిటో చూపిస్తానంటూ స్పష్టం చేశాడు రన్ మెషీన్. కోహ్లీని వెంటనే తొలగిస్తే బావుంటుందని సూచించాడు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. అతడి స్థానంలో యంగ్ క్రికెటర్లకు చాన్స్ ఇవ్వాలని సూచించాడు.
Also Read : టి20 టాప్ -5లో బాబర్ ఆజమ్ టాప్