Kapil Sharma : సినిమాలపై నాకు అవగాహన లేదు – కపిల్ శర్మ
కమెడియన్..యాంకర్ షాకింగ్ కామెంట్స్
Kapil Sharma : వివిధ చిత్రాలపై బహిష్కరించాలని పిలుపునిస్తుండడం చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో ప్రముఖ కమెడియన్ , స్టార్ యాంకర్ కపిల్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.
దయచేసి తనను ట్విట్టర్ కు దూరంగా ఉండనీయండంటూ కోరారు. ఇటీవల అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ ఛద్దా నటించిన మూవీని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు.
అయితే తనకు త్వరలో సినిమా విడుదలయ్యే సినిమా ఏదీ లేదని స్పష్టం చేశారు. సినిమాలు సమాజంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.
ఇదే సమయంలో సినిమాలను బహిష్కరించడం అనేది ఆయా అంశాలను, సున్నిశిత విషయాలను ఆసరాగా చేసుకుని ఉంటాయని కానీ తనకు వాటిపై మాట్లాడే , వ్యాఖ్యానించే హక్కు లేదన్నారు కపిల్ శర్మ(Kapil Sharma).
గత కొన్ని వారాలుగా విడుదలైన హిందీ చిత్రాలు లాల్ సింగ్ చద్దాతో పాటు అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్ , అనురాగ్ కశ్యప్ తీసిన దోబారా బహిష్కరణలకు గురయ్యాయి.
ఒక రకంగా ఇది పబ్లిషిటి స్టంట్ అంటున్నారు మరికొందరు. ఏది ఏమైనా 133 కోట్ల భారతీయులు నివసిస్తున్న ఈ తరుణంలో కులాలు, మతాలు, జాతులను సంతృప్తి పరచడం అనేది అసాధ్యమని అభిప్రాయపడ్డారు కపిల్ శర్మ. తాను వాటిపై వ్యాఖ్యానించే సత్తా లేదని స్పష్టం చేశారు.
నేను కేవలం సెలబ్రిటీలను ఇంటర్వ్యూ మాత్రమే చేస్తా. అంతే కానీ తనకు సినిమాల పట్ల అంతగా అవగాహన లేదన్నారు. వాటిపై వ్యాఖ్యానించే సత్తా, జ్ఞానం తనకు లేనే లేదని స్పష్టం చేశారు కమెడియన్ , స్టార్ షో నిర్వాహకుడు కపిల్ శర్మ.
Also Read : స్టన్నింగ్ ఎలేవేషన్స్ తో సెగలు పుట్టించిన దిశా పటాని