Kishan Reddy : పదవుల కోసం పాకులాడ లేదు
బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి
Kishan Reddy : నేను సామాన్య కార్యకర్త నుంచి వచ్చాను. పార్టీ నాకు ముఖ్యం. ఆ తర్వాతే పదవులు. ఏ రోజూ నాకు ఈ పదవి కావాలని అడగలేదు. ఎవరినీ దేబరించ లేదని స్పష్టం చేశారు రాష్ట్ర బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాకు అడగకుండానే పదవులు కట్టబెట్టారు. నాపై నమ్మకం ఉంచారు. ఆపై తనకు అన్ని విధాలుగా సహకారం అందించారని చెప్పారు. తనకు ఏ పదవి అప్పగించినా లేదా అప్పగించక పోయినా ఎక్కడ కూడా అసంతృప్తికి లోను కాలేదన్నారు.
ఇవాళ రాత్రి ముఖ్య నేతలతో సమావేశం కావడం జరుగుతుందన్నారు జి. కిషన్ రెడ్డి. 1980 నుంచి నేను పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ వచ్చానని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
6,000 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులతో పాటు వరంగల్ లో రైల్వే మాన్యుఫాక్చరింగ్ హబ్ ను ప్రారంభిస్తారని స్పష్టం చేశారు జి. కిషన్ రెడ్డి(Kishan Reddy). రాబోయే ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వచ్చేలా చేస్తామన్నారు. తాను గతంలో పార్టీ చీఫ్ గా పని చేశాను. ఆ తర్వాత పార్టీ నాకు కేంద్ర మంత్రి పదవిని ఇచ్చింది. వాటిని కూడా సమర్థవంతంగా నిర్వహించానని చెప్పారు.
ఈనెల 8న వరంగల్ లో మోదీ సభ జరుగుతుందన్నారు. రాష్ట్ర నాయకులతో కీలక చర్చలు ఉంటాయన్నారు. దక్షిణాదిలోని రాష్ట్రాల చీఫ్ లతో సమావేశం 9న హైదరాబాద్ లో ఉంటుందని వెల్లడించారు జి. కిషన్ రెడ్డి.
Also Read : TTD EO : లోక కళ్యాణం కోసం చతుర్వేద హవనం