IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు !

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు !

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దిరోజులకు తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్నవారిని మార్చింది. అనంతరం లోక్‌ సభ(Lok Sabha) ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్దఎత్తున మార్పులు చేసింది.

IAS Transfers – కొత్తగా నియమితులైన కలెక్టర్లు వీరే !

ఖమ్మం: ముజామిల్‌ ఖాన్‌
నాగర్‌కర్నూల్‌: సంతోష్‌
భూపాలపల్లి: రాహుల్‌శర్మ
కరీంనగర్‌: అనురాగ్‌ జయంతి
పెద్దపల్లి: కోయ శ్రీహర్ష
జగిత్యాల: సత్యప్రసాద్‌
మంచిర్యాల: కుమార్‌ దీపక్‌
మహబూబ్‌నగర్‌: విజయేంద్ర
హనుమకొండ: ప్రావీణ్య
నారాయణపేట్‌: సిక్తా పట్నాయక్‌
సిరిసిల్ల: సందీప్‌కుమార్‌ ఝా
భద్రాద్రి కొత్తగూడెం: జితేష్‌ వి పాటిల్‌
వికారాబాద్‌: ప్రతీక్‌ జైన్‌
కామారెడ్డి: ఆశిష్‌ సంగ్వాన్‌
నల్గొండ: నారాయణరెడ్డి
వనపర్తి: ఆదర్శ్‌ సురభి
సూర్యాపేట కలెక్టర్‌: తేజస్‌ నందలాల్‌ పవార్‌
వరంగల్‌: సత్య శారదాదేవి
ములుగు: దివాకరా
నిర్మల్‌: అభిలాష అభినవ్‌

Also Read : Suresh Gopi: వివాదంలో కేంద్ర మంత్రి సురేష్‌ గోపీ !

Leave A Reply

Your Email Id will not be published!