IAS Transfers: ఏపీలో కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులు
ఏపీలో కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులు
IAS Transfers: ఎన్నికల సంఘం వేటుతో ఇటీవల బదిలీ అయిన ఏపీలోని కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఎన్నికలతో సంబంధం లేని శాఖలను వారికి కేటాయించారు. దీనిలో భాగంగా ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా లక్ష్మీ షాను నియమించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా రాజాబాబు, తితిదే జేఈవోగా గౌతమి, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ గా అంబేడ్కర్, పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీగా వెంకట్రామిరెడ్డి నియమితులయ్యారు. సీసీఎల్ఏ కార్యదర్శిగా ప్రభాకర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
IAS Transfers in AP
ఏపీలో(AP) అధికార పార్టీకు కొమ్ముకాస్తూ ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసింది. కూటమి నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్రవిచారణ చేపట్టిన ఎన్నికల సంఘం ఐదుగురు ఎస్పీలను, ఒక డీఐజీను, ముగ్గురు కలెక్టర్లను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల విధులతో సంబంధం లేని శాఖలకు ఆయా అధికారులను బదిలీ చేయాలని సూచించింది. దీనితో ఎన్నికల సంఘం వేటు వేసిన అధికారుల్లో కొంతమందికి వివిధ పోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
Also Read : NDA Manifesto: ‘ప్రజా మేనిఫెస్టో’ లో సామాన్యులకు భాగస్వామ్యం కల్పిస్తున్న కూటమి !