ICC Men’s T20 World Cup: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విజేతలకు దక్కిన ప్రైజ్‌మనీ తెలుసా ?
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విజేతలకు దక్కిన ప్రైజ్‌మనీ తెలుసా ?
ICC Men’s T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సమరం ముగిసింది. సుమారు పదకొండు ఏళ్ల తర్వాత భారత్ ఖాతాలోకి ఐసీసీ ట్రోఫీ చేరింది. చివరిగా 2013లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అదే ధోనీ సారథ్యంలోనే 2007 కూడా ఈ పొట్టి కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్ గా 2024 టీ20 ప్రపంచ కప్ లో విశ్వవిజేతగా భారత్ నిలిచింది. దక్షిణాఫ్రికాతో ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో టీమ్ ఇండియా గెలిచింది.
కోహ్లీ నిలకడమైన ఇన్నింగ్స్, అక్షర్ పటేల్ మెరుపు బ్యాటింగ్, దూబే క్లైమాక్స్ హిట్టింగ్ తో బ్యాటింగ్ ఫరవాలేదు అనిపించుకున్న టీమిండియా… బౌలింగ్ కు వచ్చేసరికి మధ్యలో కాస్తా తడబడినా నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో తిరుగులేని విజయం సాధించింది. స్లాగ్ ఓవర్స్ లో బూమ్రా, హర్షదీప్ ల పొదుపైన బౌలింగ్, సూర్యకుమార్ యాదవ్ అత్యద్భుతమైన క్యాచ్, హార్డిక్ పాండ్యా కట్టుదిట్టమైన ఫైనల్ ఓవర్… రోహిత్ శర్మ కెప్టెన్సీ వెరసి భారత్ ను విజయతీరాలకు చేర్చింది.
అయితే ఐసీసీ టీ20 ప్రపంచ కప్(ICC Men’s T20 World Cup) గెలిచిన విజేతలు, రన్నరప్, మరియు ఇతర జట్టులకు ఇచ్చే ప్రైజ్ మనీపై ఇప్పుడు నెట్టింట తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ వివరాలు చూద్ధాం. విజేత భారత్ కు, రన్నరప్ గా నిలిచిన దక్షిణాఫ్రికాకు భారీ మొత్తంలోనే ప్రైజ్‌మనీ దక్కగా… సెమీస్‌లో నిష్క్రమించిన జట్లకూ ఐసీసీ ప్రైజ్‌మనీని అందించింది.
ICC Men’s T20 World Cup – ప్రైజ్‌మనీ వివరాలు (దాదాపు) ఇలా !
విజేత: భారత్‌కు రూ. 20.50 కోట్లు
రన్నరప్: దక్షిణాఫ్రికాకు రూ. 10.60 కోట్లు
సెమీఫైనలిస్టులు: ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్‌కు చెరో రూ. 6.50 కోట్లు
సూపర్-8కు చేరిన 12 జట్లు: ఒక్కో టీమ్‌కు రూ. 2 కోట్లు
13 నుంచి 20వ స్థానంలోని ఒక్కో టీమ్‌కు రూ.1.90 కోట్లు
ప్రతి జట్టు విజయం సాధించిన మ్యాచ్‌కు అదనంగా రూ. 26 లక్షలు
టీ20 ప్రపంచ కప్ ప్రైజ్‌మనీ మొత్తం విలువ రూ. 93.80 కోట్లు
Also Read : T20 Worldcup : రక్తం చిందించి 17 ఏళ్ల తర్వాత ఛాంపియన్ కుర్చీలో భారత జట్టు